Computer Baba
-
జోడో యాత్రలో వివాదాస్పద కంప్యూటర్ బాబా.. బదులివ్వాలన్న బీజేపీ
అగర్‌మాల్వా(మధ్యప్రదేశ్): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో శనివారం వివాదాస్పద గురువు నాందేవ్ దాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో మహుదియా గ్రామం వద్ద శనివారం ఆయన రాహుల్‌తో కలిసి నడిచారు. ఇండోర్ సమీపంలోని తన ఆశ్రమంలోని అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన పంచాయతీ సిబ్బందిపై చేయి చేసుకున్న కేసులో నాందేవ్ 2020లో అరెస్టయ్యారు. అలాంటి పలు కేసులున్న, జైలుకు వెళ్లొచ్చిన నిందితునితో రాహుల్‌తో కలిసి నడవడమేంటని బీజేపీ నిలదీసింది. అయితే, దేశ క్షేమం కోసం చేపట్టిన యాత్రలోకి సాధువులతో సహా అందరూ ఆహ్వానితులేనని కాంగ్రెస్ బదులిచ్చింది. అయితే ఈ కంప్యూటర్ బాబాకు 2018లో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సహాయ మంత్రి హోదాతో కూడిన పదవి కట్టబెట్టింది! అనంతరం బీజేపీతో పొసగక ఆయన కాంగ్రెస్ పంచన చేరారు. జోడో యాత్రలో పాల్గొన్నందుకు మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ టీచర్‌ను శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. ఆరెస్సెస్ సమావేశాల్లో పాల్గొనే ప్రభుత్వోద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. -
‘వారు ఆలయాల్లో అత్యాచారాలు చేస్తారు’
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలు ధరించి.. పొడులమ్ముకునేవారు.. ఆలయాల్లో అత్యాచారాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌ని ఉద్దేశిస్తూ.. దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సమాగమ్ కార్యక్రమానికి దిగ్విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ.. ‘పురాతన సనాతన ధర్మాన్ని విస్మరించే వారిని దేవుడు కూడా క్షమించాడు. ప్రస్తుత సమాజంలో కాషాయ వస్త్రాలు ధరించి పొడులమ్ముకునే వారు కొందరు ఆలయాల్లో అత్యాచారాలు చేస్తున్నారు. అలానే కొందరు వ్యక్తులు జై శ్రీ రాం నినాదాన్ని హై జాక్ చేశారు. రాముడి పేరిట నినాదాలు చేసే వీరు సీతను ఎందుకు మర్చిపోతున్నారు’ అని దిగ్విజయ్ ప్రశ్నించారు. దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ వేదిక మీదనే ఉండటం విశేషం. అలానే ఈ కార్యక్రమానికి హాజరైన కంప్యూటర్ బాబా సాధువుల తరఫున మాట్లాడుతూ.. ఆలయాలకు ప్రభుత్వ భూముల్ని కేటాయించాలని.. వాటికి ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని.. అంతేకాక సాధువులుకు కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. #WATCH Digvijaya Singh, Congress in Bhopal: Today, people are wearing saffron clothes and raping, rapes are happening inside temples, is this our religion? Those who have defamed our 'Sanatan Dharma', not even god will forgive them. pic.twitter.com/psAQcd1R7p — ANI (@ANI) September 17, 2019 -
బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు : కంప్యూటర్ బాబా
భోపాల్ : మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కంప్యూటర్ బాబాగా పేరొందిన స్వామీజీ నాందాస్ త్యాగి అన్నారు. మధ్యప్రదేశ్ పార్టీ నాయకత్వం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ గ్రీన్‌సిగ్నల్ లభిస్తే బీజేపీ ఎమ్మెల్యేల పేర్లు వెల్లడిస్తానని కంప్యూటర్ బాబా పేర్కొనడం గమనార్హం. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో న్యాయవాదుల పరిరక్షణ బిల్లుకు అనుకూలంగా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం ఓటు వేసిన నేపథ్యంలో బాబా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, క్రాస్ ఓటింగ్‌పై తీవ్రంగా స్పందించిన ఆర్ఎస్ఎస్ బీజేపీ రాష్ట్ర శాఖ నుంచి సవివర నివేదిక కోరినట్టు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కుప్పకూలిన క్రమంలో బీజేపీ నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టేందుకు మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ అప్రమత్తమయ్యారు. తమ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేస్తుందని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడుపోయేందుకు సిద్ధంగా లేరని ఆయన చెప్పారు. -
సమాధి అవుతా.. సహకరించండి!
భోపాల్: సజీవ సమాధి అయ్యేందుకు అనుమతించాలని మధ్యప్రదేశ్‌కు చెందిన స్వామి వైరాగ్యానంద ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దిగ్విజయ్ సింగ్ విజయం సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. డిగ్గీరాజా గెలవకుంటే సజీవ సమాధి అవుతానని ఆయన ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్ చేతిలో దిగ్విజయ్ 3.60 లక్షల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో వైరాగ్యానందను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆయన సజీవ సమాధికి అనుమతి కోరుతూ భోపాల్ కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. ‘ప్రస్తుతం నేను కామాఖ్యధామంలో ఉంటున్నాను. మాట నిలబెట్టుకునేందుకు జూన్ 16న మధ్యాహ్నం 2.11 గంటలకు సజీవ సమాధిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. స్థానిక యంత్రాగం నాకు సహకరిస్తుందని నమ్ముతున్నాను’ అని దరఖాస్తులో వైరాగ్యానంద పేర్కొన్నారు. దీనికి అనుమతి ఇవ్వొద్దని తాను భోపాల్ డీఐజీకి లేఖ రాసినట్టు కలెక్టర్ తరుణ్‌కుమార్ పిథోడ్ తెలిపారు. వైరాగ్యానందను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు చెప్పారు. కంప్యూటర్ బాబాగా గుర్తింపుపొందిన నామ్‌దేవ్ దాస్ త్యాగి కూడా ఎన్నికల సమయంలో దిగ్విజయ్ సింగ్‌కు మద్దతుగా యజ్ఞయగాదులు, రోడ్‌షోలు నిర్వహించారు. దిగ్విజయ్ స్వయంగా వీటిల్లో పాల్గొన్నారు. -
ముల్లును ముల్లుతోనే...
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కాషాయపక్షాన్ని కట్టడి చేసేందుకు కాంగ్రెస్ సైతం అదే కాషాయాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. పదేళ్ళ పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న దిగ్విజయ్ సింగ్‌ని ఓడించాలని బీజేపీ, ఎలాగైనా విజయతీరాలకు చేరాలని సీనియర్ కాంగ్రెస్ దిగ్గజం దిగ్విజయ్ సింగ్ ప్రచారానికి కాషాయాన్ని జోడించారు. భోపాల్‌లో మే 12న జరిగే ఆరోదశ లోక్‌సభ పోలింగ్‌లో నియోజకవర్గంలో దిగ్విజయ్‌సింగ్ వర్సెస్ ప్రగ్యాసింగ్ ఠాకూర్ల మధ్య పోల్వార్ హోరు పూజలూ, యజ్ఞాలతో రంజుగా మారింది. ఈ ఇరువురూ భోపాల్‌లో గెలుపుకోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్‌ని కట్టడి చేయడం కోసం మాలెగాం కేసులో జైలుపాలై అనారోగ్యం పేరుతో బెయిలుపై బయటకు వచ్చిన సాధ్వి ని బరిలోకి దింపింది. అదే కాషాయ సిద్ధాంతాన్ని ఎదుర్కొనేందుకు ముల్లుని ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్న కాంగ్రెస్ ప్రగ్యాసింగ్‌కి ప్రతిగా దిగ్విజయ్ సింగ్ తరఫున కంప్యూటర్ బాబాని స్క్రీన్‌పైకి తెచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రగ్య, వివాదాస్పద కార్యక్రమాలతో దిగ్విజయ్‌సింగ్ ఇరువురూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో భోపాల్ ఎన్నికల ప్రచారం కాషాయంతో కలగాపులగంగా మారింది. ఏది బీజేపీ యజ్ఞమో, ఏది కాంగ్రెస్ ప్రచారమో తెలుసుకోలేనంతగా ఇప్పుడు భోపాల్‌లో పరిస్థితి తారుమారయ్యింది. ఇటీవలే కంప్యూటర్ బాబా దిగ్విజయ్ విజయం కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో 5000 మంది సాధువులతో భారీ యాగాన్ని నిర్వహించారు. దీనికి ప్రతిగా ప్రగ్యా ఠాకూర్ అక్షయ తృతీయ సందర్భంగా పరశురామ్ జయంతి పూజలు భారీగా నిర్వహించడం గమనార్హం. ఒకప్పుడు బీజేపీతో ఉన్న నామ్‌దేవ్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా ఇటీవలే కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ గెలుపుకోసం విస్తృ తంగా ప్రచారం చేస్తున్నారు. దిగ్విజయ్ తరఫున యజ్ఞాలతో పాటు ప్రచారం కూడా చేస్తోన్న బాబా ప్రగ్యని ఉద్దేశించి బీజేపీ నాయకులు ప్రగ్యని బలిపశువుని చేశారని వ్యాఖ్యానిస్తే, సాధ్వి ప్రగ్య మాత్రం ఒకప్పుడు రాముడే మిథ్య అన్న వారు ఇప్పుడు యజ్ఞాలు చేస్తున్నారనీ, అంతకు మించిన అచ్చాదిన్ ఏముంటాయంటూ తనపై విమర్శలను తిప్పి కొడుతున్నారు. -
దిగ్విజయ్‌కు కంప్యూటర్ బాబా మద్దతు
భోపాల్: భోపాల్ లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్‌సింగ్ విజయాన్ని కాంక్షిస్తూ వందలాది మంది సాధువులు మంగళవారం భోపాల్ చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. కంప్యూటర్ బాబాగా పేరుపొందిన సాధూ నామ్‌దేవ్ త్యాగి ఆధ్వర్యంలో వారు మంగళవారం ఆసనాలు వేస్తూ ప్రచారం నిర్వహించారు. కంప్యూటర్ బాబాకు అప్పటి బీజేపీ ప్రభుత్వం నర్మదా పరిశుభ్రత ప్యానెల్లో సహాయ మంత్రి హోదా కట్టబెట్టింది. అయితే, ఆయన ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వపనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. -
డిగ్గీ రాజా గెలుపు కోసం కంప్యూటర్ బాబా పూజలు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా ఉన్న సమయంలో మంత్రి హోదాను అనుభవించిన కంప్యూటర్ బాబా తాజాగా భోపాల్ కాంగ్రెస్ అభ్యర్ధి దిగ్విజయ్ సింగ్ గెలుపుకోసం హఠ యోగా నిర్వహించారు. వందలాది సన్యాసులతో భోపాల్‌లోని సైఫియా కాలేజ్ మైదానంలో ఆయన ఈ పూజలు జరిపారు. బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లలో రామ మందిరం నిర్మించలేదని, మందిర్ లేకుండా నరేంద్ర మోదీ కూడా ఉండటానికి వీల్లేదని కంప్యూటర్ బాబా మండిపడ్డారు. బీజేపీకి చెందిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై దిగ్విజయ్ సింగ్ విజయాన్ని కాంక్షిస్తూ మూడు రోజుల పాటు ఏడు వేల మంది వరకూ సాధువులు పూజలు చేయనున్నారు. దిగ్విజయ్ సింగ్‌కు ఓటు వేయాలని కోరుతూ వందల మంది సన్యాసులు భోపాల్‌లో ఆటపాటలతో ప్రజలను కోరతారని కంప్యూటర్ బాబాగా పేరొందిన నామ్‌దేవ్ దాస్ త్యాగి చెప్పారు. కాషాయ వస్ర్తాలను ధరించినందుకే ప్రజ్ఞా సింగ్‌ను సాధ్విగా పిలవడం తగదని అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలతో ఆమెకు సంబంధం ఉందని, ఆమె హత్య కేసులోనూ నిందితురాలని కంప్యూటర్ బాబా ఆరోపించారు. -
సీఎంకు ‘కంప్యూటర్ బాబా’ ఝలక్
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు స్వామి నామ్‌దేవ్ త్యాగి ఝలక్ ఇచ్చారు. పట్టుమని ఆరునెలలు కూడా గడవక ముందే సహాయ మంత్రి పదవికి రాజీనామా చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వల్లే తాను రాజీనామ చేస్తున్నట్లు ‘కంప్యూటర్ బాబా’గా ప్రసిద్ధికెక్కిన నామ్‌దేవ్ త్యాగి ప్రకటించారు. నర్మదా నది పరిరక్షణ హామీలను నిలబెట్టుకోవడంలో చౌహాన్ సర్కారు విఫలమైందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నన్ను మోసం చేశారు. నర్మాద నదిలో అక్రమ మైనింగ్‌ని అడ్డుకుంటానని ఆయన హమీ ఇచ్చారు. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఫలితంగా నేను చేసిన వాగ్దానాలను కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో నా అనుచరులకు ఏమని చెప్పాలి.. వారికి నా మొహం ఎలా చూపించాలి’ అని ప్రశ్నించారు. అంతేకాక తాను ఇచ్చిన ఏ ఒక్క హమీని నిలబెట్టుకోలేకపోయానని.. అందువల్లే తన పనితీరు గురించి ప్రజలు వందకు సున్నా మార్కులు ఇచ్చారని వాపోయారు. దాంతో పదవిని వదులుకోవాలని నిర్ణయంచినట్టు వెల్లడించారు. దీనంతటికి కారణం సీఎం చౌహన్ అని ఆరోపించారు. అంతేకాక నర్మదా నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక మైనింగ్ గురించి ప్రజలకు తెలియజేయడం కోసం ఒక యాత్రను చేపట్టనున్నట్లు కంప్యూటర్ బాబా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు స్వామిజీలకు సహాయ మంత్రి హోదా కల్పించింది. వారిలో కంప్యూటర్ బాబా ఒకరు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. -
సన్యాసిని సీఎం చేస్తే ఏం ఒరిగింది!
సాక్షి, భోపాల్: ఐదుగురు సాధువులకు మంత్రి పదవులు ఇవ్వడం మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. వారు ఏం సాధించారని మంత్రి హోదా కల్పిస్తారని ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ప్రశ్నిస్తోంది. మత గురువులైన నర్మదానంద్ మహరాజ్, కంప్యూటర్ బాబా, హరిహరానంద్ మహరాజ్, భయ్యూ మహరాజ్, పండిత్ యోగేంద్ర మహంత్‌లకు మంత్రి హోదా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు నర్మదా నది సంరక్షణా కమిటీ సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాజ్ బబ్బర్ బీజేపీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాషాయం వస్త్రాలు ధరించిన సాధువులను చూపించి ఓట్లడిగి ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఓ సన్యాసిని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే ఏం జరిగిందో దేశం మొత్తం చూసిందని రాజ్ బబ్బర్ పేర్కొన్నారు. నేరాలు పెరిగిపోవడం, మత ఘర్షణలు జరగడం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. కేవలం తమ పాపాల నుంచి విముక్తి పొందేందుకే బాబాలు, సాధువులకు పదవులు, హోదాలు బీజేపీ కల్పిస్తుందన్నారు. సహాయ మంత్రులుగా తమని నియమించడంపై కంప్యూటర్ బాబా స్పందించారు. బాబాలు, మత గురువులు, సాధువులకు పదవులు కట్టబెట్టడంలో తప్పేముందని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. మేం చేసిన పనికి ప్రతిఫలం లభించినట్లు భావిస్తున్నాం. నర్మదా ఘటాలా అవినీతితో పాటు నర్మదా నది పరిరక్షణలో జరిగిన అక్రమాలు, అవినీతిని బయటపెట్టినట్లు కంప్యూటర్ బాబా గుర్తుచేశారు. సాధువులను నర్మదా పరిరక్షణ నేపథ్యంలో సహాయ మంత్రులుగా నియమించడంలో తప్పేంలేదని, ప్రొటోకాల్ ప్రకారమే వారికి బాధ్యతలు అప్పగించామని బీజేపీ అధికార ప్రతినిధి రజనీశ్ అగర్వాల్ తెలిపారు. దీంతో ప్రజలు భాగస్వాములుగా మారితే నది పరిరక్షణ పనులు తేలికగా జరుగుతాయని చెప్పారు.