న్యూఢిల్లీ: గృహాల కొనుగోలుదారులు వంచనకు గురవుతున్నారంటూ సుప్రీంకోర్టు బుధవారం ఆవేదన వ్యక్తం చేసింది. ఒప్పందం ప్రకారం ముందుగా నిర్ణయించిన సమయానికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయనందుకుగాను కొనుగోలుదారులకు రూ.50 లక్షల మధ్యంతర నష్టపరిహారాన్ని అందజేయాల్సిందిగా జేపీ గ్రూప్‌ను కోర్టు ఆదేశించింది. గృహ కొనుగోలుదారులను సామాన్య పెట్టుబడిదారులుగా చూడకూడదనీ, వారు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును ఇంటిపై ఖర్చు పెడుతున్నారని, వారిని మోసం చేయడం భావ్యం కాదంది.