మీడియాతో సత్సంబంధాలు కోరుకుంటున్నా | Congratulate media for coverage of Swachh Bharat, says narendra modi | Sakshi
Sakshi News home page

మీడియాతో సత్సంబంధాలు కోరుకుంటున్నా

Published Sat, Oct 25 2014 1:49 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మీడియాతో సత్సంబంధాలు కోరుకుంటున్నా - Sakshi

మీడియాతో సత్సంబంధాలు కోరుకుంటున్నా

న్యూఢిల్లీ : స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి మీడియా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఆయన శనివారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో  పత్రికా సంపాదకులు, జర్నలిస్టులతో ఫేస్ టూ ఫేస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ స్వచ్ఛ్ భారత్పై మీడియాలో మంచి కథనాలు వచ్చాయని ప్రశంసించారు.

తాను మీడియాతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.  మీడియాతో తనకు చాలా సంవత్సరాలుగా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. అయితే మీడియా రాసిన వార్తలు విశ్వసనీయంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement