ధనికులకే నిద్రలేని రాత్రులు! | sleepless nights to 'black' guys itself | Sakshi
Sakshi News home page

ధనికులకే నిద్రలేని రాత్రులు!

Published Tue, Nov 15 2016 1:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ధనికులకే నిద్రలేని రాత్రులు! - Sakshi

ధనికులకే నిద్రలేని రాత్రులు!

నోట్ల రద్దుతో పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు: ప్రధాని మోదీ
అవినీతి సమూల నిర్మూలనకు అసౌకర్యం భరించాలని విజ్ఞప్తి
అవినీతి, మోసాన్ని కొనసాగించాలా? అంటూ విపక్షాలకు ప్రశ్న

 
 ఘాజీపూర్: పెద్ద నోట్ల రద్దుతో పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని, అవినీతిపరులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అవినీతి సమూల ప్రక్షాళనకు ప్రజలు కొద్దిపాటి అసౌకర్యం భరించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో బీజేపీ పరివర్తన్ యాత్రలో సోమవారం ప్రసంగిస్తూ... అవినీతి, మోసాల్ని దేశంలో కొనసాగించాలా? అని విపక్షాల్ని ప్రశ్నించారు. తన నిర్ణయం వల్ల బలవంతులతో పోరాడక తప్పదని తెలుసని, ప్రభుత్వాల్ని పడగొట్టే శక్తి వారికుందని, అలాంటి వ్యక్తులకు భయపడనని చెప్పారు.‘నోట్ల రద్దు అనంతరం... పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అదే సమయంలో ధనవంతులు నిద్రమాత్రలు మింగి నిద్రపోవాల్సిన పరిస్థితి.  ప్రజల ఇబ్బంది అర్థం చేసుకున్నా. నా నిర్ణయం కొంచెం కఠినమే. నేను యువకుడిగా ఉన్నప్పుడు పేదలు స్ట్రాంగ్ టీ కోసం తరచూ అడిగేవారు. ఇప్పుడది ధనవంతులకు నచ్చడం లేదు’ అని మోదీ పేర్కొన్నారు.

 ఎమర్జెన్సీతో ఇబ్బంది పెట్టింది మీరే
 సామాన్యుడిని తన నిర్ణయం తీవ్ర ఇక్కట్లు పాలు చేస్తోందన్న కాంగ్రెస్ విమర్శలకు సమాధానమిస్తూ.. ‘కాంగ్రెస్ హయాంలో అత్యవసర పరిస్థితి విధించి.. ప్రజలతో పాటు మీడియా హక్కుల్ని కాలరాశారు’ అని తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 25 పైసల్ని రద్దు చేయడాన్ని తప్పుపట్టిన మోదీ... ఏ చట్టం కింద వారు  ఆ పని చేశారని ప్రశ్నించారు. ‘వారి స్వప్రయోజనం కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు. మేంఅందరి సమానత్వం కోసం నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పారు. విపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని.. అవినీతి, నిజాయితీ లేమిని ఈ దేశంలో కొనసాగించాలా? అని ప్రశ్నించారు. ‘ప్రజల్ని తప్పుదోవ పట్టించకండి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తోన్న కాంగ్రెస్... మొత్తం దేశంలో 19 నెలల పాటు ఎమర్జెన్సీ విధించి జైలుగా మార్చారు’ అని విమర్శించారు. అప్పటి ప్రధాని ఇందిర తన సీటును కాపాడుకునేందుకు ఎమర్జెన్సీ విధించారని పేదల కోసం కాదని చెప్పారు.

 కొందరు వ్యక్తులకు భయపడేది లేదు..
 తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి రోజున ఘజీపూర్‌లో రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించాలని ఉద్దేశపూర్వకంగానే ఎంచుకున్నానని అన్నారు. ‘మీరు(నెహ్రూ) లేరు. మీ పార్టీ, కుటుంబ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీ పుట్టిన రోజున మీ చిరకాల వాంైఛె న ప్రజల అభివృద్ధి కోసం నేను పనిచేస్తున్నా’ అని పేర్కొన్నారు.‘దేశంలో అభివృద్ధికి డబ్బు కొరత లేదు. కొందరి వద్దే డబ్బు నిల్వ ఉండిపోరుుంది. అది ఉండాల్సిన చోట లేదు. డబ్బుపెట్టెలు నిండుగా ఉన్నవారు చాలా బలవంతులు. వారితో పోరాటం తప్పదని నాకు తెలుసు. ప్రభుత్వాల్ని కొనేందుకు వారి వద్ద బలం ఉంది. ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి ఉంది. ఎవరి భవిష్యత్తునైనా వారి నాశనం చేయగలరు. నేను అలాంటి వ్యక్తులకు భయపడాలా? నిజాయతీ మార్గాలన్ని వదిలిపెట్టి పారిపోవాలా? మీ ఆశీర్వాదాలతో ఈ పెద్ద పోరాటాన్ని ప్రారంభించాను.వ్యతిరేకుల విషయంలో భయపడడం లేదు. సత్య, నిజాయితీ మార్గాల నుంచి తప్పుకునేదిలేదు’ అని అన్నారు.

 ఇదే సరైన చర్య.. పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోకపోతే నకిలీ నోట్లతో ఏర్పడ్డ ముప్పునకు అడ్డుకట్ట వేయలేమన్నారు. ‘నకిలీ నోట్లను సరిహద్దుల్లో ముద్రించి దేశమంతా వెదజల్లుతున్నారు. ఇలాంటి ఎత్తుగడను యుద్ధం ప్రకటించి ఎదుర్కోలేం. రూ. 500, రూ వెరుు్య నోట్లు రద్దైనప్పటి నుంచి... కనీసం చెల్లింపులు చేయలేక ఉగ్రవాదులు చాలా ఆందోళన చెందుతున్నారు’ అని మోదీ తెలిపారు. తమ కార్యకలాపాలకు ఉగ్రవాద సంస్థలు నకిలీ నోట్లను వాడుతున్నాయన్న నిఘా వర్గాల సమాచారంపై మాట్లాడుతూ... ‘శత్రువు నకిలీ నోట్లతో దేశాన్ని ముంచెత్తుతోంది. దీనికి ముగింపు పలకాలి’ అన్నారు. ‘మనం ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు కొంత నొప్పి కలుగుతుంది. అరుుతే ఉద్దేశం సరైంది కావాలి. నేను చేస్తున్నదంతా పేదలు, రైతులు, గ్రామీణుల కోసమే... గృహిణులు కూతురి పెళ్లికి దాచుకున్న డబ్బును లాగేసుకుంటున్నారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. బ్యాంకుల్లో ఉన్న గృహిణుల రూ. 2.5 లక్షలు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోం. ఆ డబ్బుపై వారికి వడ్డీ వస్తుంది’ అని ప్రసంగంలో ప్రధాని పేర్కొన్నారు.

 ముఖంపై నవ్వు.. తెరవెనుక కుట్ర
 కొన్ని రాజకీయ పార్టీలకు ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ మాయావతిని ఉద్దేశించి విమర్శించారు. ‘వారు భారీ నోట్ల దండలతో ముఖాల్ని కప్పుకున్నారు’ అని తప్పుపట్టారు. కొంత మంది నేతలు ముఖాలపై నవ్వు పులుముకుని... మోదీ మంచి పనిచేశారంటూ చెబుతున్నా, పార్టీ కార్యకర్తల్ని మాత్రం నోట్ల రద్దు నిర్ణయం వ్యతిరేకించమంటూ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. నోట్లను గంగా నదిలో పడేసి మీ పాపాలు కడుక్కోలేరు అంటూ తప్పుపట్టారు.

 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన
 ఘాజీపూర్ పర్యటనలో భాగంగా పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి భోజ్‌పురిలో ప్రసంగించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినందుకు యూపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ పూర్తి మెజార్టీ సాధించడంలో యూపీది కీలకపాత్ర అని అన్నారు.. పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన పరమ వీర చక్ర అవార్డు గ్రహీత హ మీద్‌కు మోదీ నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement