రాష్ట్రాన్ని కాదు.. కాంగ్రెస్ ప్రజలను విభజిస్తోంది: రాజ్ నాథ్ | Congress party dividing the people only, says Rajnath Singh | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని కాదు.. కాంగ్రెస్ ప్రజలను విభజిస్తోంది: రాజ్ నాథ్

Published Thu, Feb 6 2014 5:28 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రాష్ట్రాన్ని కాదు.. కాంగ్రెస్ ప్రజలను విభజిస్తోంది: రాజ్ నాథ్ - Sakshi

రాష్ట్రాన్ని కాదు.. కాంగ్రెస్ ప్రజలను విభజిస్తోంది: రాజ్ నాథ్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాల్సింది పోయి కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను విభజిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు. విభజనను రాజకీయం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య విబేధాలను సృష్టిస్తోందని రాజ్ నాత్ సింగ్ ఆరోపించారు. దేశ రాజధానిలో తెలంగాణ బిల్లుకు మద్దతు కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ తన బృందంతో రాజ్ నాథ్ ను కలిశారు.
 
కేసీఆర్ బృందంతో సమావేశం తర్వాత మీడియాతో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము కట్టుబడి వున్నాం ఉన్నాం స్పష్టం చేశారు.  కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ విధానాన్ని గమనించాలని కేసీఆర్‌కు రాజనాథ్ సింగ్ సూచన చేశారు. ఈ భేటిలో రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఏకాంతంగా కేసీఆర్‌ చర్చలు జరిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement