ఆప్ను చూసి నేర్చుకోండి: కార్తీ చిదంబరం | Congress should learn from Aam Aadmi Party: Karti Chidambaram | Sakshi
Sakshi News home page

ఆప్ను చూసి నేర్చుకోండి: కార్తీ చిదంబరం

Published Thu, Feb 12 2015 12:02 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఆప్ను చూసి నేర్చుకోండి: కార్తీ చిదంబరం - Sakshi

ఆప్ను చూసి నేర్చుకోండి: కార్తీ చిదంబరం

చెన్నై: కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నాయకులే ప్రత్యక్ష దాడికి దిగుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం మరోసారి పార్టీపై విమర్శలతో పాటు పలు సూచనలు చేశారు. అంతేకాకుండా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ని చూసి నేర్చుకోవాలని కార్తీ చిదంబరం కాంగ్రెస్కు సలహాలు ఇచ్చారు.

కార్తీ చిదంబరం గురువారమిక్కడ  మీడియాతో మాట్లాడుతూ.. 'అత్యధిక మెజారిటీతో గెలిచినందుకు 'ఆప్'కు అభినందనలు. ఆప్ను చూసి కాంగ్రెస్ ప్రత్యేకించి...టీఎన్సీసీ చాలా నేర్చుకోవాలి. రాష్ట్ర నాయకత్వం బాగుంటేనే పార్టీ బలోపేతం అవుతుందనే విషయం గమనించాలి.  పార్టీకి ఓ ప్రత్యేక ఎజెండాను తయారు చేసుకోవాలి. ప్రజాదరణ కలిగిన నాయకుణ్ని ఎంపిక చేయాలి. నాయకుడిని ఎంపిక చేయటంలో తొందరపాటు నిర్ణయాలు పనికి రావు' అని అన్నారు. ఇప్పటికే పలుమార్లు సొంత పార్టీపై విమర్శలు చేసిన కార్తీ అధిష్టానం నుంచి షోకాజ్ నోటీసులు కూడా అందుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement