
శబరిమలలో ఆగిన పనులు
కొల్లాం: ఇద్దరు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలతో శబరిమలలో పనులను బహిష్కరిస్తున్నట్లు ప్రభుత్వ కాంట్రాక్టర్లు ప్రకటించారు. ఏటికేడు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉన్న అయ్యప్ప దేవస్థానం బోర్డు, కేరళ ప్రభుత్వం సంయుక్తంగా శబరిమల ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాయి. ముఖ్యంగా క్యూలైన్, దర్శనానంతరం కిందకు దిగేదారి వంటి పనులతో పాటు కొండమీద మరిన్నిపనులను సత్వరమే పూర్తి చేయాలని దేవస్థానం బోర్డు భావిస్తోంది.
అవినీతి పరులైన కొందరు కాంట్రాక్టర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ కాంట్రాక్టర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కాంట్రాక్టర్లు కొల్లాం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనిని నిరసిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టర్లు పనులను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
శబమరిమల, కొల్లాం