ముంబై : కరోనాపై పోరాటానికి ప్రజలంతా సహకరించాలని పోలీసులు, అధికారులు నెత్తి.. నోరు మొత్తుకొని చెబుతున్నా ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. కరోనా వైరస్ సంక్రమించకుండా ముందు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలన్న నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో అధికారుల ఆదేశాలను పట్టించుకొని వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
మార్చి 20 నుంచి ఈ రోజు(మంగళవారం) వరకు మొత్తం 5,600 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం వారిపై 3131 కేసులు నమోదు చేశారు. అయితే వారందరినీ బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన అనంతరం 1130 మందిని విడుదల చేశామని, ఇంకా 259 మంది నిందితులు కస్టడిలో ఉన్నట్లు తెలిపారు. (అండర్సన్ తల పగులగొట్టాలనుకున్నా’ )
మొత్తం 3131 కేసులలో లాక్‌డౌన్ కాలంలో అనవసరంగా సమావేశమైనందుకు 2271 కేసులు.. క్వారంటైన్ నిబంధనలను ఉల్లఘించినందుకు10 కేసులు.. అక్రమంగా వాహనాలు నడిపినందుకు 629 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మిగిలిన కేసులు లాక్‌డౌన్ అమలులో షాపులు, కార్యాలయాలు తెరిచిఉన్నందున కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులలో ఎక్కువగా తూర్పు ముంబైలో 801 కేసులు, ఉత్తర ముంబైలో 790 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ('థ్యాంక్యూ సోనియా జీ; మీ ఆరోగ్యం జాగ్రత్త' )
Comments
Please login to add a commentAdd a comment