
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,336 కరోనా కేసులు నమోదు కాగా, 47 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,601కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి 3,252 మంది కోలుకున్నారని, 590 మంది మృతిచెందారని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 14,759 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్టు పేర్కొంది.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 4,666 కరోనా కేసులు నమోదు కాగా, 232 మంది మృతిచెందారు. ఆ తర్వాత ఢిల్లీలో 2,081, గుజరాత్‌లో 1,939, రాజస్తాన్‌లో 1,576, తమిళనాడులో 1,520, మధ్యప్రదేశ్‌లో 1,485, ఉత్తరప్రదేశ్‌లో 1,184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు గోవాలో 7 గురికి కరోనా సోకగా.. వారంతా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కేరళలో కూడా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మొత్తం 408 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 291 మంది కోలుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment