
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నా దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌లు నమోదవుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9887 పాజిటివ్ కేసులు నమోదు కాగా 294 మంది మృత్యువాత పడ్డారు. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో ఇప్పటివరకు 2,36,657 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,14,073 మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,642 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 1,15,942 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. (కరోనాతో బాలీవుడ్ నిర్మాత కన్నుమూత)
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 68,50,236 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,98,224 మంది మృత్యువాతపడ్డారు. అత్యధిక కేసులు నమోదయిన దేశాల్లో భారత్ (2,36,657) ఆరోస్థానంలో నిలిచింది. అమెరికాలో ఇప్పటివరకు 19,65,708 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత బ్రెజిల్ (6,46,006), రష్యా(4,49,834), స్పెయిన్ (2,88,058) దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. (కరోనా కోరల్లో నిమ్స్!)
Comments
Please login to add a commentAdd a comment