సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే దేశంలో రెండు పర్యాయాలు లాక్‌డౌన్ కొనసాగింది. ప్రస్తుతం మూడవ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇక లాక్‌డౌన్ పొడగింపుపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే నరేంద్రమోదీ కూడా లాక్‌డౌన్ 4.0 ఉంటుందని మంగళవార రాత్రి జాతీనుద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించారు. అయితే లాక్‌డౌన్ పొడగింపు నిర్ణయాన్ని చాలా మంది స్వాగతించారు. (చదవండి : లాక్‌డౌన్ కొనసాగుతుంది.. అయితే)
ఈ నేపథ్యంలో అసలు లాక్‌డౌన్ పొడగింపు అవసరమా? ఒకవేళ పొడగిస్తే ఎన్ని రోజులు పొడగిస్తారు? ఏదైనా సడలింపులు ఉంటాయా అనే అంశాలపై ప్రజలు చర్చించుకుంటున్నారు. లాక్‌డౌన్‌పై ‘సాక్షి’ నిర్వహించిన పోల్‌లో పలువురు నెటిజన్లు తమ అభిప్రాయలను వెల్లడించారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ జనం ఇష్టానుసారంగా రోడ్లపై సంచరించడంపై మీ అభిప్రాయం ఏంటని నెటిజన్లును పశ్నించగా... ఎక్కువ మంది బయటకు రాకపోవడమే మంచిదని అంటున్నారు. మరికొంత మంది పరిమితంగా బయటకు వస్తే బాగుటుందని అభిప్రాయపడుతున్నారు.దాదాపు ఎక్కువ మంది నెటిజన్లు మోదీ నిర్ణయం వైపే మొగ్గు చూపారు.
అభిప్రాయాలు వెలిబుచ్చిన మొత్తం నెటిజన్లలో 33 శాతం మంది బయటకి రావడం మంచిది కాదని అంటే.. 26 శాతం మంది పరిమితంగా బయటకి వస్తే మంచిదేనని అంటున్నారు. ఇక 22 శాతం లాక్‌డౌన్‌ను ఇంకా పొడగించాలని, 9శాతం మరిన్ని సడలింపులు ఇవ్వాలని, మరో 9శాతం లాక్‌డౌన్ 17 వరకు సరిపోతుందని, ఇంకా పెంచొద్దని కోరుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా లాక్‌డౌన్ పొడగింపుపై పెద్ద చర్చే జరుగుతోంది. కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయని, వాటిని అదుపులోకి తీసుకురావాలంటే లాక్‌డౌన్ కొనసాగాల్సిందేనని కొంతమంది అభిప్రాయపడుతుంటే.. మరికొంతమంది కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment