ముంబై: కంగనా రనౌత్, హృతిక్ రోషన్ల ఈ-మెయిల్ వివాదంలో కేసులో పురోగతి సాధించేందుకు హృతిక్ ఈ-మెయిల్ అకౌంట్కు సంబంధించిన వివరాలను ముంబై క్రైమ్ సెల్ అధికారులు ఇవ్వాలని యూఎస్లోని పెన్సిల్వేనియాలోని 1 అండ్ 1, మెయిల్ అండ్ మీడియా ఐఎన్సీ కంపెనీలకు శనివారం అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీచేసింది.
వేరే ఎవరో తన పేరు మీద అకౌంట్ను ఉపయోగిస్తున్నారని హృతిక్ కోర్టుకు చెప్పడంతో దీనిపై విచారణ చేపట్టాలని క్రైమ్ సెల్ అధికారులను కోర్టు ఆదేశించింది. కేసులో మరిన్ని సాక్ష్యాలు జతచేసేందుకు కంగనాను తన కంప్యూటర్ ఫోరెన్సిక్ అధికారులకు ఇవ్వాలని కోరినట్టు పోలీసులు తెలిపారు.
ఈ నెల 18న అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ జడ్జి ఎమ్ఆర్ నాథు ఆదేశాల ప్రకారం విదేశాలలో ఉన్న కంపెనీల నుంచి క్రిమినల్ కేసులకు సంబంధించిన సమాచారం చట్టబద్దంగా తీసుకోవచ్చని విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా కంపెనీల నుంచి ఈమెయిళ్ల సమాచారాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు.
గత నెల మార్చి 5న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం హృతిక్ ఇచ్చిన సమాచారం ప్రకారం నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో 2014 మే 24న కరణ్ జోహార్ పార్టీలో కంగనా క్వీన్ మూవీని తాను మెచ్చుకున్నానని అందుకు ధన్యవాదాలు తెలిపిందని, కానీ నేను ఆ సినిమాను అసలు చూడలేదని తనతో చెప్పానని హృతిక్ తెలిపారు. మరి మీరు క్వీన్ సినిమాను మూడు సార్లు చూసినట్లు నాతో చెప్పారని ఆమె అడగడంతో తాను ఎప్పుడు చెప్పానని అడిగితే.. నిన్న రాత్రి ఈ-మెయిల్ చాట్లో అని ఆమె తెలిపిందని హృతిక్ పేర్కొన్నారు. కంగనాకు హెచ్రోషన్@ఈమెయిల్.కామ్ నుంచి మెయిల్ వచ్చినట్లు చెప్పారని, కానీ హెచ్రోషన్@మ్యాక్.కామ్ మాత్రమే అనేది తన అకౌంట్ హృతిక్ ఎఫ్ఐఆర్లో ఇచ్చిన సమాచారంలో పేర్కొన్నారు.
మరుసటి రోజు కంగనా సోదరి రంగోలి నుంచి తనకు మెయిల్ వచ్చిందని అందులో అసభ్యకరమైన ఫోటోలు ఉండటంతో పాటు అది తాను కంగనాకు పంపిన మెయిల్ అని ఆమె చెప్పడంతో నేను సరదాకి చెప్తున్నారా? అని.. తాను ఆ మెయిల్ పంపలేదని కావాలంటే పర్సనల్గా కలిసి వివరణ తీసుకోవచ్చని చెప్పినట్లు పోలీసులకు ఇచ్చిన సమాచారంలో హృతిక్ తెలిపారు.
ఈ-మెయిళ్ల విచారణ కోసం యూఎస్కు కంగనా, హృతిక్ల కేసు
Published Sat, Apr 23 2016 4:47 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
Advertisement
Advertisement