Cyber crime cell
-
భవిష్యత్‌లో పెను సవాల్.. ఠాణాకో సైబర్ క్రైమ్ టీమ్
సాక్షి, హైదరాబాద్: సిటీలో సగటున రోజుకు 100 ఎఫ్ఐఆర్లు నమోదవుతుంటే వాటిలో 20 శాతం సైబర్ నేరాలకు సంబంధించినవే అని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. రానున్న రోజుల్లో ఈ నేరాలను పెను సవాల్‌గా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ సైబర్ క్రైమ్ టీమ్స్ ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘చోరీలు, స్నాచింగ్స్, దోపిడీలు వంటి నేరాలు తగ్గుతుండగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు ప్రతి వ్యాపార, ఇతర లావాదేవీలు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో ఈ నేరాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సైబర్ క్రైమ్ నిరోధానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు బాధ్యతలు స్వీకరించిన రోజే స్పష్టం చేశాం. ఇందులో భాగంగా ప్రతి ఠాణాలోనూ ఎస్సై, నలుగురు హెడ్–కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లకు సైబర్ క్రైమ్ టీమ్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. వీరికి అవసరమైన ఉపకరణాలు, శిక్షణ సైతం ఇవ్వాల్సి ఉంటుంది. పేజీ పేమెంట్ గేట్‌వే సంస్థలో జరిగిన సైబర్ నేరం దర్యాప్తు హ్యాకింగ్ కేసులకు పాఠంగా పనికి వస్తుంది. మహేష్ బ్యాంక్ కేసు కూడా కొంత అనుభవాన్ని ఇచ్చింది’ అని అన్నారు. ఆ మూడు సంస్థల విషయం ఆర్బీఐ దృష్టికి... ‘పేమెంట్ గేట్‌వేలనే హ్యాక్ చేసిన నిందితుడు దినేష్ మూడేళ్లలో దాదాపు రూ.3 కోట్లు స్వాహా చేశాడు. ఇతడి వల్ల సైబర్ నేరాల బారినపడిన పేజీ, బెస్ట్ పే, మహాగ్రామ్‌ల సర్వర్లలో అనేక లోపాలున్నాయి. పేజీ సంస్థ అడ్మిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉంది. వీటి విషయాన్ని ఆర్బీఐకి లేఖ ద్వారా తెలియజేస్తాం. -
పోర్న్ వీడియో: అందులో ఉన్నది తాను కాదంటూ ఏడ్చిన నటి
ప్రస్తుతం ఇంటర్నెట్లో తన పేరుతో వైరలవుతోన్న పోర్న్ వీడియోలో ఉన్నది తాను కాదన్నారు మలయాళ నటి రమ్యా సురేష్. ఈ క్రమంలో ఫేస్బుక్ వేదికగా తన ఆవేదనను వెల్లడిస్తూ.. కన్నీరు పెట్టారు రమ్యా సురేష్. ‘‘ఇంటర్నెట్లో వైరలవుతన్న పోర్న్ వీడియోలో ఉంది నేను కాదు. అసలు ఈ వీడియో గురించి నాకు తెలియదు. ఓ స్నేహితురాలు చెప్పడంతో ఆ వీడియోను నేను చూశాను. అది చూసి కుప్పకూలిపోయాను. ఎందుకంటే వీడియోలో ఉన్న యువతికి, నాకు చాలా పోలికలున్నాయి. సడెన్‌గా చూసినవారేవరైనా ఆ వీడియోలో ఉంది నేనే అనుకుంటారు. నా గురించి బాగా తెలిసిన వారు మాత్రమే అందులో ఉన్నది నేను కాదని గుర్తించగలరు.. మిగతావారు అది నేనే అని నమ్మే అవకాశం ఉంది’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో గురించి అప్పుజలోని పోలీస్ స్టేషన్లో, సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసినట్లు రమ్యా సురేశ్ తెలిపారు. ‘‘వీడియోలో ఉన్నది నేను కాదని నాకు తెలిసు. నా భర్త కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారు. అది చాలు. అందుకే ఇంత ధైర్యంగా ఉన్నాను. పోలీసులు కూడా నాకు చాలా మద్దతుగా ఉన్నారు. ఈ వీడియోని షేర్ చేసిన వారిని గుర్తించామన్నారు పోలీసులు’’ అని తెలిపారు రమ్యా సురేష్. ‘‘పోలీసులకు ఫిర్యాదు వచ్చి ఇంటికి వచ్చే సరికి నా ఫేస్బుక్ పేజ్‌కి చాలా మెసేజ్‌లు వచ్చాయి. నా స్నేహితులు కాల్ చేస్తున్నారు. మాట్లాడలంటే చాలా భయం వేస్తుంది. ఏం అంటారో అనిపిస్తుంది. నేను ఎక్కడా రాజీపడలేదు కాబట్టే ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొవాల్సి వచ్చిందని నాకు తెలుసు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒక్కటే.. వీడియోలో ఉన్నది నేను కాదు. నా మాట నమ్మండి.. నా గురించి తప్పుగా అనుకోకండి’’ అని కోరారు రమ్యా సురేష్. కుటుంబ సభ్యుల మద్దతు తనకు పూర్తిగా ఉందని త్వరలోనే ఈ సమస్య నుంచి బయటపడతానని రమ్యా సురేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె చివరిసారిగా నయనతార, కుంచాకో బోబన్ నిజాల్ చిత్రంలో కనిపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. చదవండి: ఫోన్లో మెసేజ్‌లను తొలగించిన నటి -
అసత్యా ప్రచారంపై క్రైమ్ పోలీసులకు పూనమ్ కౌర్ ఫిర్యాదు
-
సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పూనమ్ కౌర్
సాక్షి, హైదరాబాద్: సినీ నటి పూనమ్ కౌర్ మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై అసత్యా ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. వీడియో షేరింగ్ వెబ్సైట్ యూట్యూబ్‌లో కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై అసభ్యకరమైన వీడియోలు పోస్టు చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. తనను కించపరిచేవిధంగా, నా వ్యక్తిత్వాన్ని అవమానించేలా యూట్యూబ్‌లో కొందరు పోస్టులు పెడుతున్నారని, సోషల్ మీడియాలోనూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలా పుకార్లు సృష్టించి.. దుష్ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని నటి పూనమ్ కౌర్ సైబర్ క్రైమ్ పోలీసులను అభ్యర్థించారు. ఈ సందర్బంగా పూనమ్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదన్నారు. గత రెండేళ్లుగా తన పేరుతో కొంతమంది యూట్యూబ్‌లో వీడియో లింక్స్ పెడుతూ.. మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆమె తెలిపారు. సుమారు 50 యూట్యూబ్ ఛానల్స్‌పై ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఆన్లైన్లో ఇలా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. -
ఈ-మెయిళ్ల విచారణ కోసం యూఎస్‌కు కంగనా, హృతిక్‌ల కేసు
ముంబై: కంగనా రనౌత్, హృతిక్ రోషన్ల ఈ-మెయిల్ వివాదంలో కేసులో పురోగతి సాధించేందుకు హృతిక్ ఈ-మెయిల్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలను ముంబై క్రైమ్ సెల్ అధికారులు ఇవ్వాలని యూఎస్‌లోని పెన్సిల్వేనియాలోని 1 అండ్ 1, మెయిల్ అండ్ మీడియా ఐఎన్‌సీ కంపెనీలకు శనివారం అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీచేసింది. వేరే ఎవరో తన పేరు మీద అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారని హృతిక్ కోర్టుకు చెప్పడంతో దీనిపై విచారణ చేపట్టాలని క్రైమ్ సెల్ అధికారులను కోర్టు ఆదేశించింది. కేసులో మరిన్ని సాక్ష్యాలు జతచేసేందుకు కంగనాను తన కంప్యూటర్ ఫోరెన్సిక్ అధికారులకు ఇవ్వాలని కోరినట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 18న అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ జడ్జి ఎమ్ఆర్ నాథు ఆదేశాల ప్రకారం విదేశాలలో ఉన్న కంపెనీల నుంచి క్రిమినల్ కేసులకు సంబంధించిన సమాచారం చట్టబద్దంగా తీసుకోవచ్చని విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా కంపెనీల నుంచి ఈమెయిళ్ల సమాచారాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు. గత నెల మార్చి 5న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం హృతిక్ ఇచ్చిన సమాచారం ప్రకారం నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో 2014 మే 24న కరణ్ జోహార్ పార్టీలో కంగనా క్వీన్ మూవీని తాను మెచ్చుకున్నానని అందుకు ధన్యవాదాలు తెలిపిందని, కానీ నేను ఆ సినిమాను అసలు చూడలేదని తనతో చెప్పానని హృతిక్ తెలిపారు. మరి మీరు క్వీన్ సినిమాను మూడు సార్లు చూసినట్లు నాతో చెప్పారని ఆమె అడగడంతో తాను ఎప్పుడు చెప్పానని అడిగితే.. నిన్న రాత్రి ఈ-మెయిల్ చాట్‌లో అని ఆమె తెలిపిందని హృతిక్ పేర్కొన్నారు. కంగనాకు హెచ్రోషన్@ఈమెయిల్.కామ్ నుంచి మెయిల్ వచ్చినట్లు చెప్పారని, కానీ హెచ్రోషన్@మ్యాక్.కామ్ మాత్రమే అనేది తన అకౌంట్ హృతిక్ ఎఫ్ఐఆర్లో ఇచ్చిన సమాచారంలో పేర్కొన్నారు. మరుసటి రోజు కంగనా సోదరి రంగోలి నుంచి తనకు మెయిల్ వచ్చిందని అందులో అసభ్యకరమైన ఫోటోలు ఉండటంతో పాటు అది తాను కంగనాకు పంపిన మెయిల్ అని ఆమె చెప్పడంతో నేను సరదాకి చెప్తున్నారా? అని.. తాను ఆ మెయిల్ పంపలేదని కావాలంటే పర్సనల్‌గా కలిసి వివరణ తీసుకోవచ్చని చెప్పినట్లు పోలీసులకు ఇచ్చిన సమాచారంలో హృతిక్ తెలిపారు.