సాక్షి, తిరువనంతపురం : కరోనావైరస్(కోవిడ్ 19) కేసుల సంఖ్య భారత్‌లో రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 34మంది కరోనా బారిన పడగా.. తాజాగా మరో ఐదుగురికి ఈ ప్రాణాంతక వైరస్ సోకింది. ఈ ఐదుగురు కేరళలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. దీంతో దీంతో దేశంలో కరోనా వైరస్ బారిన పడిన బాధితులు సంఖ్య 39కి చేరుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
(చదవండి : వైరస్‌పై ప్రధాని సమీక్ష)
ఆ ముగ్గురితో పాటు మరో ఇద్దరి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా ప్రకటించారు. ఆ కుటుంబంలో కరోనా బారిన పడిన వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. కేరళ ఆరోగ్యశాఖమంత్రి కేకే శైలజా మాట్లాడుతూ ఆ కుటుంబ సభ్యులు ఎయిర్‌పోర్టులో తమ ప్రయాణ వివరాలు తెలియజేయలేదన్నారు. ఈ కారణంగానే వారికి తక్షణం పరీక్షలు చేయలేదన్నారు. వారు ఇటలీ నుంచి వచ్చాక వారి బంధువులను కలుసుకున్నారని, వారికి కూడా వ్యాధి లక్షణాలు కనిపించిన నేపధ్యంలో వారు ఆసుపత్రికి వచ్చారన్నారు. వారినందిరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment