న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో దేశ రాజధాని ఢిల్లీ తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. అందుకు ప్రధాన కారణం ఢిల్లీ మొత్తం కూడా దుమ్ముధూళితో నిండిపోయి పరిమితికి మించిన కాలుష్య కోరల్లో చిక్కుకోవడమే. దీనిని నిలువరించేందుకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచనలు చేస్తుండటంతో ఢిల్లీలో కాలుష్యం అంతగా పేరుకుపోయిందా అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇంతకీ అసలు ఢిల్లీలో అంతగా కాలుష్యం పెరిగిపోవడానికి గల కారణాలు ఏమిటి? అక్కడి వాహనాలు విడుదల చేస్తున్న వాయురూపంలోని కర్బన పదార్థాలను వాతావరణంలోకి విడుదల చేయడమే కారణమా? ఇంకేదైనా ఉందా? అని పరిశీలించగా కారణాలు తెలిసాయి.
వాహనాలకంటే కూడా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పంటపొలాలను తగులబెడుతుండటంతోపాటు దానికి సరిహద్దులో ఉన్న ఆయా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితుల వల్లే ఎక్కువమొత్తంలో కాలుష్యపూరిత వాయువులు విడుదల అవుతున్నట్లు, ఇది కూడా వాహనాలు విడుదల చేసే కాలుష్యం కన్నా 20రెట్లు అధికంగా ఉన్నట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గుర్తించింది. ఈ నేపథ్యంలో వెంటనే ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ వెంటనే పంటతగులబెట్టే కార్యక్రమాలను బ్యాన్ చేయాలని ఆదేశించింది. లేదంటే విషపూరిత వాయువులు పెరగడం ఖాయమని హెచ్చరించింది.
ఢిల్లీకి ఆ పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుసా?
Published Wed, Dec 9 2015 4:24 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM
Advertisement
Advertisement