crop burning
-
చట్టాల కోరలు తీశారు
న్యూఢిల్లీ: దేశంలో పర్యావరణ చట్టాల్లో సవరణలు చేసి, చివరకు వాటిని కోరల్లేనివిగా మార్చేశారని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనాన్ని నియంత్రించడానికి తీసుకొచి్చన ‘దేశ రాజధాని, పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) చట్టం–2021’ను ఎందుకు కఠినంగా అమలు చేయడం లేదని ప్రశ్నించింది. సీఏక్యూఎం చట్టం విషయంలో కేంద్రం తీరును న్యాయస్థానం తప్పుపట్టింది. చట్టం అమలుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండానే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆక్షేపించింది. ఢిల్లీలో కాలుష్యం తీవ్రత, పంట వ్యర్థాల దహనం సమస్యపై జస్టిస్ అభయ్ ఎస్.ఓకా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపించారు. సీఏక్యూఎం చట్టంలోని సెక్షన్ 15కు సంబంధించి మరికొన్ని నియంత్రణలను మరో 10 రోజుల్లో జారీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ చట్టాన్ని ప్రభావవంతంగా అమలు చేయడానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడంతోపాటు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వివరించారు. పంజాబ్, హరియాణా అధికారులకు, కాలుష్య నియంత్రణ మండళ్లకు సీఏక్యూఎం ఇప్పటికే లేఖలు రాసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పంట వ్యర్థాలను దహనం చేస్తూ కాలుష్యానికి కారణమవుతునవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఆదేశించిందని అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తమకు తెలుసని పేర్కొంది. కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమవుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. చటాన్ని ఉల్లంఘించే వారిపై పర్యావరణ పరిహార పన్నును మరింత పెంచేలా చట్టంలో సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంజాబ్, హరియాణా ప్రభుత్వాల తీరుపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాల దహనాన్ని ఎందుకు అరికట్టడం లేదని నిలదీసింది. సీఏక్యూఎం ఆదేశాలను ఆయా ప్రభుత్వాలు అమలు చేయడం లేదని మండిపడింది. కాలుష్య నియంత్రణ విషయంలో పంజాబ్, హరియాణా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు కేవలం కంటితుడుపు తప్ప అందులో కార్యశీలత లేదని ఆక్షేపించింది. పంట వ్యర్థాలను దహనం చేసేవారికి కేవలం రూ.2,500 చొప్పున జరిమానా విధించడం ఏమిటని ప్రశ్నించింది. కేవలం నామమాత్రంగా జరిమానా విధించి, కాలుష్యానికి లైసెన్స్ ఇస్తున్నారా అని న్యాయస్థానం మండిపడింది. -
పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కన్నెర్ర
న్యూఢిల్లీ: శీతాకాలంలో దేశ రాజధానిని వాయకాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్న పంట వ్యర్థాల దహనం ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టకుండా అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు కోర్టు తిట్ల తలంటుపోసింది. వ్యర్థాలను తగలబెట్టిన వారికి నామామాత్రపు జరిమానాలు వేస్తూ వదిలేస్తున్న ప్రభుత్వాల తీరును ఎండగట్టింది. ఇలాంటి నిర్లక్ష్య ధోరణిపై అక్టోబర్ 23వ తేదీన తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కోర్టు బుధవారం సమన్లు జారీచేసింది. విధి నిర్వహణలో విఫలమైన ఆయా ప్రభుత్వాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం)ను కోర్టు ఆదేశించింది. సంబంధిత కేసును సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాహ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం బుధవారం విచారించింది. దహనాలను నివారించేందుకు 2021 జూన్‌లో నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) ప్రాంతంలో అమలుచేయాల్సిన సీఏక్యూఎం నిబంధనలను గాలికొదిలేసిన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇదేం రాజకీయ అంశం కాదుగా: ‘‘తగలబెట్టడం వల్ల శీతాకాలంలో ఢిల్లీ మొత్తం పొగచూరుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై అధికారగణం ఒత్తిడి ఉంటే వారికీ మేం సమన్లు జారీచేస్తాం. రాష్ట్రాల వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పంజాబ్ ప్రభుత్వం గత మూడేళ్లలో నిబంధనలను అతిక్రమించిన వారిలో ఒక్కరిపై కూడా కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టలేదు. తప్పుచేసిన వారిని విచారించేందుకు ఎందుకంత భయపడుతున్నారు?. ఇదేం రాజకీయ అంశం కాదు. కమిషన్ నిబంధనలను ఖచి్చతంగా పాటించాల్సిందే. ఇందులో రాజకీయాలకు తావులేదు. మీరే నియమాలను ధిక్కరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నారు. నామామాత్రపు జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. పంటభూముల్లో ఎక్కడెక్కడ పంటవ్యర్థాలను తగలబెడుతున్నారో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) మీకు లొకేషన్ పంపుతోంది. మీరే అది ఎక్కడుందో దొరకట్లేదని కుంటి సాకులు చెబుతున్నారు’’అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి: పంజాబ్ కోర్టు ఎదుట పంజాబ్ తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురీ్మందర్ సింగ్ వాదించారు. ‘‘పొలాల్లో వ్యర్థాలను కాలి్చన ఘటనలపై అధికారులు నమోదుచేసిన రెవిన్యూ రికార్డులు తప్పులతడకగా ఉంటున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం చాలా కష్టమవుతోంది. ఆదేశాలకు, వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి’’అని చెప్పారు. కేంద్రప్రభుత్వానికీ చీవాట్లు ‘‘కేంద్రప్రభుత్వం వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్‌ను కోరలు పీకిన పాములా మార్చేసింది. ఆదేశాలు ఇవ్వడం తప్ప వాటిని అమలుచేసే బాధ్యత, సర్వాధికారాలు దానికి అప్పజెప్పలేదు. వాయుకాలుష్య సంబంధ నిపుణులను సీఏక్యూఎంలో ఎంపికచేయలేదు. సీఏక్యూఎం సభ్యుల విద్యఅర్హతలు అద్భుతంగా ఉన్నాయిగానీ అవి గాలినాణ్యత రంగానికి ఎందుకూ పనికిరావు’అని వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి వాదించారు. సభ్యుల్లో ఒకరు గతంలో మధ్యప్రదేశ్ కాలుష్యనియంత్రణ మండలికి ఆరేళ్లు చైర్మన్‌గా ఉన్నారని గుర్తుచేశారు. ‘‘అక్కడ సారథిగా ఉండటమనేది అసలైన అర్హత కాబోదు. కాలుష్య నియంత్రణ మండలి ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా?. వాయుకాలుష్యరంగ నిపుణులతో కమిషన్‌ను పటిష్టంచేయాలి’అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఢిల్లీ ప్రాంతంలో సీఏక్యూఎం చట్టం, 2021 ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగించటంలో సీఏక్యూఎం పూర్తిగా విఫలమైంది. దహనం ఘటనలను యద్దప్రాతిపదికన అడ్డుకోవాల్సిన బాధ్యత మీదే’అని కమిషన్‌పై కోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. -
ఇనుప బట్టీలతో బయోచార్ : బెట్ట నుంచి రక్షణ, 15శాతం అదనపు పంట!
పంట కోతలు పూర్తయ్యాక పత్తి, కంది, సోయా తదితర పంటల కట్టెకు నిప్పుపెట్టి పర్యావరణానికి హాని చేసే కన్నా.. ఆ కట్టెతో కట్టె బొగ్గు (బయోచార్) తయారు చేసి, తిరిగి భూములను సారవంతం చేసుకోవచ్చు. ఎకరానికి టన్ను బయోచార్ కం΄ోస్టు వాడితే పంటలు బెట్టను తట్టుకుంటాయి. తద్వారా పంట దిగుబడులను 12–15% వరకు పెంచుకోవచ్చని మహారాష్ట్రలో ఓ రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనుభవం చాటి చెబుతోంది..పంట వ్యర్థాలను తగులబెట్టటం పరిపాటి. ఇది పర్యావరణానికి హాని చేసే పని. పత్తి కట్టె, కంది కట్టె వంటి పంట వ్యర్థాలను కాలబెట్టటం వల్ల గాలి కలుషితమై కార్బన్డయాక్సయిడ్ శాతం పెరిగిపోతంది. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది. రసాయనిక ఎరువుల వాడకం పెరిగిపోయింది. ఫలితంగా సాగుభూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయింది. మట్టికి నీటిని పట్టి ఉంచే శక్తి లోపించటం, వాన నీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం తగ్గి΄ోవటం, సూక్ష్మజీవరాశి నశించటం వల్ల భూములు నిస్సారమైపోతున్నాయి. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో 4 లక్షల హెక్టార్లలో పత్తి, లక్ష హెక్టార్లలో కంది పంటలను రైతు సాగు చేస్తారు. పంట కోత పూర్తయిన తర్వాత రైతులు పత్తి, కంది కట్టెను కాల్చివేస్తారు. దీని వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా భూమికి తిరిగి అందాల్సిన సేంద్రియ పదార్థం అందకుండా పోతోంది. బిఎఐఎఫ్ (బైఫ్) డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే పుణేకు చెందిన స్వచ్ఛంద సంస్థ యవత్మాల్ రైతులతో కలసి పనిచేసి ఈ పరిస్థితిలో విజయవంతంగా మార్పుతెచ్చింది. పత్తి, కంది కట్టెను వట్టిగా కాలబెట్టకుండా.. ఒక పద్ధతి ప్రకారం (దీన్నే పైరోలిసిస్ అంటారు) కాల్చితే బొగ్గుగా మారుతుంది. దీన్నే బయోచార్ అంటారు. దీన్ని సేంద్రియ ఎరువులతో కలిపి బయోచార్ కంపోస్టుగా మార్చి భూమిలో చల్లితే మట్టిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంతతి పెరిగి భూసారం మెరుగవుతుంది. బయోచార్ కంపోస్టు వాడకం వల్ల ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ నేలలకు బెట్టను తట్టుకునే శక్తిని పెంపొందిస్తాయి. బయోచార్ కంపోస్టు తయారు చేయాలంటే.. బయోచార్ను ఉత్పత్తి చేసే ఇనుప బట్టీని ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత చిన్న రైతులకు విడిగా ఉండదు. అందుకని బైఫ్ ఫౌండేషన్ రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్.పి.ఓ.ని) 2019లో రిజిస్టర్ చేయించింది. 220 మంది రైతులను కూడగట్టి ఒక్కొక్క రైతు నుంచి రూ. వెయ్యి షేర్ ధనంతో ఎఫ్.పి.ఓ.ను రిజిస్టర్ చేయించారు. పత్తి, కంది కట్టెను కాల్చవద్దని, దీనితో ఎఫ్పిఓ తరఫున బయోచార్ తయారు చేసుకొని పంటలకు వాడుకుంటే బెట్టను తట్టుకొని మంచి దిగుబడులు పొందవచ్చని బైఫ్ ఫౌండేషన్ సిబ్బంది రైతులకు ఆలోచన కలిగించారు. 2021 జనవరిలో ఎఫ్పిఓ పత్తి కట్టెను రైతుల నుంచి కిలో రూ. 2.5–3లు చెల్లించి కొనుగోలు చేసింది. రూ. 60 వేల ఖర్చుతో బ్యాచ్‌కు 200 కిలోల కట్టెను కాల్చే ఇనుప బట్టీని ఎఫ్పిఓ కొనుగోలు చేసింది. ఈ బట్టీ ద్వారా పైరోలిసిస్ పద్ధతిలో ఈ కట్టెను కాల్చి బొగ్గును తయారు చేసింది. బొగ్గును పొడిగా మార్చి గోనె సంచుల్లో నింపి ఎఫ్పిఓ తిరిగి రైతులకే అమ్మింది. మార్కెట్ ధర కన్నా కిలోకి రూ. 2, 3 తగ్గించి అమ్మింది. 2021–22లో ఎఫ్పిఓ విజయవంతంగా 100 టన్నుల పత్తి కట్టెతో 25 టన్నుల బయోచార్ను ఉత్పత్తి చేయగలిగింది. ఎఫ్పిఓ బయోచార్ ఉత్పత్తిని చేపట్టటం వల్ల చాలా మందికి పని దొరికింది. కాల్చేసే పత్తి కట్టెను రైతు అమ్ముకొని ఆదాయం పొందాడు. కట్టెను సేకరించటంలో కూలీలకు పని దొరికింది. వాహనదారులకు కట్టెను బట్టీ దగ్గరకు చేర్చే పని దొరికింది. చివరికి బయోచార్ను రైతులే తిరిగి తక్కువ ధరకు కొనుక్కోగలిగారు. అంతిమంగా కాలబెడితే ఆవిరైపోయే పత్తి కట్టె.. ఎఫ్పిఓ పుణ్యాన భూమిని సుదీర్ఘకాలం పాటు సారవంతం చేసే బయోచార్గా మారి తిరిగి ఆ పొలాలకే చేరటం విశేషం. హెక్టారుకు 2.5 టన్నుల బయోచార్ కంపోస్టును దుక్కిలో వేశారు. ఏటేటా పంట దిగుబడులు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా భూముల్లో నుంచి ప్రతి ఏటా 2,400 కోట్ల టన్నుల మట్టి వాన నీటితో పాటు కొట్టుకు΄ోతోంది. ప్రపంచ భూభాగంలో భారత్ వాటా 2.2% మాత్రమే. అయితే, ప్రపంచం ఏటా కోల్పోతున్న మట్టిలో 23%ని, హెక్టారుకు సగటున 16% టన్నుల మట్టిని మన దేశం కోల్పోతున్నదని ఎఫ్.పి.ఓ. చెబుతున్న లెక్క. అయితే, ఢిల్లీ ఐఐటిలోని పరిశోధకుల బృందం ‘సాయిల్ ఎమర్జెన్సీ’ గురించి తాజా అధ్యయనం విస్తుగొలిపే గణాంకాలను బయటపెట్టింది. అస్సాం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎకరానికి ఏటా 100 టన్నులకు పైగా మట్టి కొట్టుకుపోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో హెక్టారుకు హెక్టారుకు ఏటా 15 నుంచి 30 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎడారీకరణకు గురవుతున్న రాయలసీమ వంటి కొన్ని చోట్ల ఏకంగా 50 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనం తేల్చింది. అడవుల నరికివేత, ప్రతి ఏటా అతిగా దుక్కిచేయటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులతో పాటు వాతావరణ మార్పులతో కుండపోత వర్షాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రం తమ భూముల్లో మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడుకోగలుగుతుండటం విశేషం. పోర్చుగల్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ గెల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ పురస్కారాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగం ఇటీవల అందుకున్న సందర్భంలో.. ప్రకృతి సాగులో ఒక ముఖ్యభాగమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పి.ఎం.డి.ఎస్.) అనే వినూత్న పద్ధతి గురించి తెలుసుకుందాం. సాయిల్ ఎమర్జెన్సీ విపత్కర స్థితిని మానవాళి దీటుగా ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు టి. విజయకుమార్ అంటున్నారు. 2023–24లో 8 లక్షల 60 వేల మంది రైతులు 3.80 లక్షల హెక్టార్లలో పి.ఎం.డి.ఎస్. పద్ధతిలో ఎండాకాలంలో వానకు ముందే విత్తారు. పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందుగా వేసవిలోనే విత్తుకునే వినూత్న పద్ధతే పి.ఎం.డి.ఎస్. సాగు. 20 నుంచి 30 రకాల పంటల విత్తనాలను కలిపి వానాకాలానికి ముందే విత్తనాలు వేస్తున్నారు. వేసవి వర్షాలకు మొలుస్తాయి. సజీవ వేరు వ్యవస్థతో మట్టిని కా΄ాడుకుంటూ.. సారవంతం చేసుకునే ప్రక్రియ ఇది. 30–60 రోజుల్లో ఈ పంటలు కోసిన తర్వాత రైతులు ప్రధాన పంటలు విత్తుకుంటారు.ఎకరానికి టన్ను బయోచార్ కంపోస్టుయవత్మాల్ జిల్లాలోని 0.5% కన్నా తక్కువగా ఉండే వర్షాధార పత్తి తదితర పంటలు పండించే నేలలను బయోచార్ కంపోస్టు పోషకవంతం చేయటమే కాకుండా నీటిని పట్టి ఉంచే సామర్ధ్యాన్ని, కరువును తట్టుకునే శక్తిని పెంపొదించింది. బయోచార్ను ఎంత మోతాదులో వేయాలనే దాన్ని ఇంకా ప్రామాణీకరించాల్సి ఉంది. హెక్టారుకు 1 నుంచి 10 టన్నుల వరకు సూచిస్తున్న సందర్భాలున్నాయి. రైతుకు మరీ భారం కాకుండా వుండేలా హెక్టారుకు 2.5 టన్నుల (ఎకరానికి టన్ను) చొప్పున బయోచార్ కంపోస్టును వేయించాం. బొగ్గు పొడితో వర్మీకంకంపోస్టు, అజొటోబాక్టర్, అజోస్పిరిల్లమ్ వంటి జీవన ఎరువులను కలిపి బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని పంట పొలాల్లో వాడాం. ఆ సంవత్సరంలోనే పత్తి, సోయా వంటి పంటల దిగుబడి 12–15% పెరిగింది. పోషకాలను నిదానంగా దీర్ఘకాలం పాటు పంటలకు అందించేందుకు, బెట్టను తట్టుకునేందుకు బయోచార్ ఉపకరిస్తుంది. బయోచార్ వినియోగం వల్ల ఒనగూడే ప్రయోజనాలను రైతులు పూర్తిగా గుర్తించేలా ప్రచారం చేయటానికి ప్రభుత్వ మద్దుతు అవసరం ఉంది. ఎఫ్పిఓలు తయారు చేసే బయోచార్ కంపోస్టుకు ప్రభుత్వం మార్కెటింగ్‌కు అవకాశాలు పెంపొందించాలి.– గణేశ్ (98601 31646), బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్, పుణే -
సుందర దేశంలో విషపుగాలి! బయటకు రావాలంటే జంకుతున్న జనం!
ప్రకృతి రమణీయత ఉట్టిపడే అందమైన దేశం, ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామమైన థాయ్‌లాండ్‌ను వాయు కాలుష్యం ముంచెత్తుతోంది. గాలి నాణ్యత దారుణంగా పడిపోతుండడంతో జనం ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలియజేసే యాప్‌లను జనం ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. యాప్ ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకుంటున్నారు. ఎర్ర మార్క్ కనిపిస్తే ఇంట్లో ఉండిపోవాల్సిందే. ఉదయం పూట వ్యాయామం చేయాలన్నా బయటకు వెళ్లలేని పరిస్థితి. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కాలుష్యం బెడద మరింత తీవ్రంగా ఉండడం కలవరం సృష్టిస్తోంది ఎయిర్ పొల్యూషన్ దెబ్బకు టూరిస్టుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రధాన పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. ఎందుకీ తీవ్ర కాలుష్యం? థాయ్‌లాండ్‌లో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా ప్రభుత్వం తరచుగా కాలుష్య హెచ్చరికలు జారీ చేయడం సాధారణమే. అయితే, ఈసారి మాత్రం కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. ఉత్తర థాయ్‌లాండ్‌లో రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తుంటారు. మూడు నెలల పాటు ఈ సీజన్ కొనసాగుతుంది. ఈ సమయంలో తీవ్ర కాలుష్యం ఉత్పన్నమవుతుంది. ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి రేణువులు వెలువడుతాయి. విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. పంట వ్యర్థాల దహనం కారణంగా రైతులు శ్వాస సంబంధిత వ్యాధుల బారినపడుతున్నట్లు, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని థాయ్‌లాండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ పరిశోధకుడు కనికా థాంపానిష్వోంగ్ చెప్పారు. దేశంలో 2021లో వాయు కాలుష్యం వల్ల 29,000 మంది మరణించారని అంచనా. ఇక రాజధాని బ్యాంకాక్‌లో తీవ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ సమస్య వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. చలికాలం కావడంతో పరిస్థితి భీతావహంగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచించిన దానికంటే థాయ్‌లాండ్ ప్రజలు సగటున నాలుగు రెట్లు అధికంగా సూక్ష్మ ధూళి కణాలను(పీఎం 2.5) పీలుస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. కాలుష్యం వల్ల దేశంలో ప్రజల జీవిత కాలం సగటున రెండేళ్లు తగ్గినట్లు థాయ్‌లాండ్ ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’అంచనా వేసింది. వేధిస్తున్న నిధుల కొరత మరోవైపు కాలుష్యాన్ని తగ్గించడంపై థాయ్‌లాండ్ సర్కారు దృష్టిపెట్టింది. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి అంతర్జాతీయ సంస్థలు, పరిశోధనా కేంద్రాలతో కలిపి పనిచేస్తోంది. కాలుష్య నియంత్రణ కోసం కొత్త కొత్త విధానాలు రూపొందిస్తున్నప్పటికీ నిధుల కొరత వల్ల అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ పాలసీల అమలుకు బడ్జెట్లో ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడం పెద్ద అవాంతరంగా మారింది. స్వచ్ఛమైన గాలిని పీల్చడం ప్రజల హక్కు, ఆ హక్కును కాపాడడంలో థాయ్‌లాండ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ గ్రీన్‌పీస్ థాయ్‌లాండ్, ఎన్విరాన్మెంటల్ లా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలు గత ఏడాది మార్చి నెలలో కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ‘క్లీన్ ఎయిర్ బిల్లు’ను ఆమోదించాలంటూ థాయ్‌లాండ్ క్లీన్ ఎయిర్ నెట్వర్క్ అనే మరో సంస్థ పోరాడుతోంది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. కాలుష్యానికి కారణమయ్యే వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించవచ్చు. మరోవైపు పంట వ్యర్థాలను దహనం చేయకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. 14.49 లక్షల మంది బాధితులు థాయ్‌లాండ్ ప్రజారోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. కాలుష్యం వల్ల దేశంలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటిదాకా 14,49,716 మంది అస్వస్థతకు గురయ్యారు. రాజధాని బ్యాంకాక్‌లో 31,695 మంది అనారోగ్యం బారినపడ్డారు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు. బాధితుల్లో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, నిమోనియా, బ్రాంకైటీస్, ఆస్తమా, ఇన్‌ఫ్లూయెంజా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి లక్షణాలు కనిపించాయి. బ్యాంకాక్‌లో తాజాగా 50కిపైగా ప్రాంతాల్లో పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్‌కు 51 నుంచి 78 మైక్రోగ్రాములు ఉన్నట్లు తేలిందని కాలుష్య నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ పిన్సాక్ సురాస్వాడీ చెప్పారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు కాలుష్యం నుంచి ఉపశమనం కోసం ప్రజలు ముఖానికి మాస్కు తప్పనిసరిగా ధరించాలని థాయ్ ఎయిర్ క్వాలిటీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రఫాన్ సూచించారు. కాలుష్యం తీవ్రత తగ్గుముఖం పట్టకపోతే ఇళ్ల నుంచే పనిచేయాలని ఉద్యోగులకు సూచిస్తామని థాయ్‌లాండ్ మంత్రి అనుపోంగ్ పావోజిండా చెప్పారు. బ్యాంకాక్‌లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యశాలలు ► కాలుష్యం, తద్వారా అనారోగ్య సమస్యలు పెరిగిపోతుండడంతో థాయ్‌లాండ్ ప్రజారోగ్య శాఖ ప్రత్యేక వైద్యశాలలు ఏర్పాటు చేసింది ► కాలుష్యం బారినపడిన వారిలో శ్వాస ఆడకపోవడం, చర్మంపై దద్దుర్లు, గుండె సంబంధిత వ్యాధులు తలెత్తున్నాయి. ► బాధితులకు చికిత్స అందించడానికి దేశవ్యాప్తంగా 66 ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. ► వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్న వ్యాధులు, నివారణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయా లని బ్యాంకాక్‌లోని 22 ప్రధాన ఆసుపత్రులకు వ్యాధుల నియంత్రణ విభాగం సూచించింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం.. హుటాహుటిన రంగంలోకి ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. బుధవారం ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 354 (వెరీ పూర్)గా నమోదైంది. నోయిడాలో 406కి పడిపోయింది. మంటలు రేపుతున్న కాలుష్యం... పంజాబ్‌లో సెప్టెంబర్ 15–నవంబర్ 1 మధ్య గతేడాదిని మించి 17,846 వ్యవసాయ వ్యర్థాల కాల్చివేతలు జరిగాయి. బుధవారం సైతం పంజాబ్‌లో 1,880 చోట్ల పంట వ్యర్థాల కాల్చివేత సాగింది! వీటిని నియంత్రించాలని ఢిల్లీ ప్రభుత్వం పొరుగు కోరుతున్నా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ మరియు నోయిడా వంటి ఢిల్లీకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రాంతీయ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని యూపీ, హరియాణా ప్రభుత్వాలను ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్ అభ్యర్థించారు. కాలుష్య సమస్య రాష్ట్ర సమస్య కాదని, అభివృద్ధి చెందుతున్న వాయు వ్యవస్థ కారణంగా ఇది జరుగుతోందని, దీని కట్టడికి ఉమ్మడి సహకారం అవసరమని రాయ్ పేర్కొన్నారు. కార్మికులకు భృతి వాయుకాలుష్యం తీవ్రరూపం దాల్చడంతో ఢిల్లీలో అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చింది. నిషేధ సమయంలో ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.5 వేలు అందించాలని సీఎం అరవింద్ కేజ్రివాల్ నిర్ణయించారు. ఇక కాలుష్యం తగ్గించేందుకు ఉద్యోగులు వీలునుబట్టి వర్క్ ఫ్రం హోమ్ పనిచే యాలని, ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని రాష్ట్ర మంత్రి గోపాల్‌రాయ్ ప్రజలను కోరారు. -
పొలాల్లో చెలరేగిన మంటలు
నిజాంసాగర్(జుక్కల్) : పంట పొలాల్లో చెలరేగిన మంటలు రైతులకు ముచ్చెమటలు పట్టించాయి. శుక్రవారం మధ్యాహ్నం నిజాంసాగర్ మండలం నర్వ, అన్నసాగర్ గ్రామ శివారులో పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. యాసంగి పంట నూర్పిడి చేసిన పొలాల్లో చెలరేగిన అగ్ని కీలలు.. కల్లాల్లో, కొయ్యకాల్లో నిల్వ ఉన్న ఎండుగడ్డికి వ్యాపించాయి. సుమారు 50 ఎకరాల మేర వ్యాపించిన మంటలు.. నర్వ బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నాయి. గ్రామ శివారులో వరి పంట నూర్పిడి చేసిన ధాన్యాన్ని పొలాల్లో ఆరబెట్టారు. దూర ప్రాంతాల నుంచి తగలబడుకుంటూ వచ్చిన మంటలు ధాన్యం కుప్పలకు వద్దకు రావడంతో స్థానికులు, రైతులు తీవ్ర ఆందోళన చెందారు. మంటలను ఆర్పేడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో విపరీతమైన గాలులు వీయడంతో మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదు. దీంతో స్థానికులు ఎల్లారెడ్డి అగ్నిమాపక శకటానికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది సుమారు మూడు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్‌సిబ్బంది వేగంగా స్పందించడంతో ధాన్యం కుప్పలకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. సుమారు రూ.10 లక్షల విలువైన ధాన్యాన్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగారు. దీంతో ఇన్చార్జి ఫైర్ అధికారి గంగాధర్, పైర్మెన్లు సంతోష్‌కుమార్, అబ్దుల్ సలాం, శ్రీకాంత్‌లను సర్పంచ్ గొట్టం అనుసూజ నర్సింహులు, మాజీ సర్పంచ్ గోపాల్ స్థానికులు అభినందించారు. -
ఢిల్లీకి ఆ పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుసా?
న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో దేశ రాజధాని ఢిల్లీ తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. అందుకు ప్రధాన కారణం ఢిల్లీ మొత్తం కూడా దుమ్ముధూళితో నిండిపోయి పరిమితికి మించిన కాలుష్య కోరల్లో చిక్కుకోవడమే. దీనిని నిలువరించేందుకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచనలు చేస్తుండటంతో ఢిల్లీలో కాలుష్యం అంతగా పేరుకుపోయిందా అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇంతకీ అసలు ఢిల్లీలో అంతగా కాలుష్యం పెరిగిపోవడానికి గల కారణాలు ఏమిటి? అక్కడి వాహనాలు విడుదల చేస్తున్న వాయురూపంలోని కర్బన పదార్థాలను వాతావరణంలోకి విడుదల చేయడమే కారణమా? ఇంకేదైనా ఉందా? అని పరిశీలించగా కారణాలు తెలిసాయి. వాహనాలకంటే కూడా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పంటపొలాలను తగులబెడుతుండటంతోపాటు దానికి సరిహద్దులో ఉన్న ఆయా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితుల వల్లే ఎక్కువమొత్తంలో కాలుష్యపూరిత వాయువులు విడుదల అవుతున్నట్లు, ఇది కూడా వాహనాలు విడుదల చేసే కాలుష్యం కన్నా 20రెట్లు అధికంగా ఉన్నట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గుర్తించింది. ఈ నేపథ్యంలో వెంటనే ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ వెంటనే పంటతగులబెట్టే కార్యక్రమాలను బ్యాన్ చేయాలని ఆదేశించింది. లేదంటే విషపూరిత వాయువులు పెరగడం ఖాయమని హెచ్చరించింది.