ఓ వ్యక్తిని బెదిరించి, దోపిడీ చేసినందుకు ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలోని ఓ సీనియర్ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ మత్స్యశాఖ మంత్రిగా పనిచేస్తున్న ఇక్బాల్ మసూద్పై కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ కేసు పెట్టారు. అయితే సర్వసాధారణంగానే మంత్రిగారు మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
దాదాపు 15 మంది అనుచరులతో కలిసి ఓ న్యాయవాది ఇంట్లోకి చొచ్చుకెళ్లి, ఆయనను బెదిరించి, విలువైన వస్తువులన్నీ దోచుకున్నట్లు ఇక్బాల్ మసూద్పై కేసు నమోదైంది. మంత్రిగారి దిష్టిబొమ్మను దహనం చేసినందుకు తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మే 28న తనను ఆయన బెదిరించినట్లు నూతన్ విజయ్ అనే ఆ న్యాయవాది అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో తన ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతో సదరు మంత్రిపైన, ఆయన అనుచరులపైన కేసు పెట్టాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
మంత్రిగారిపై దోపిడీ కేసు!!
Published Thu, Jun 26 2014 1:20 PM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM
Advertisement