మాఫియా డాన్ దావూద్ చెల్లెలు మృతి | Dawood Ibrahim's sister Haseena Parkar dead with Heart attack | Sakshi
Sakshi News home page

మాఫియా డాన్ దావూద్ చెల్లెలు మృతి

Published Mon, Jul 7 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

మాఫియా డాన్ దావూద్ చెల్లెలు మృతి

మాఫియా డాన్ దావూద్ చెల్లెలు మృతి

సాక్షి, ముంబై: పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం చెల్లెలు హసీనా పార్కర్(54) ఆదివారం ముంబైలో గుండెపోటుతో మృతిచెందింది. తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో హసీనాను ఆస్పత్రికి తీసుకెళ్లారని, ఆమె చికిత్స పొందుతూ చనిపోయిందని పోలీసులు తెలిపారు.  హసీనా.. దావూద్ ముంబై వ్యాపారాలను, అక్రమ ఆస్తులను చూసేదని సమాచారం. నాగ్‌పాడాలోని గార్డన్ హాల్ అపార్టుమెంట్‌లో విలాసవంతమైన ఫ్లాట్‌లో ఉంటున్న ఆమెకు లేడీ డాన్‌గా గుర్తింపు ఉంది. ఆమె ప్రత్యక్షంగా మాఫియాను నడపకున్నా దక్షిణ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఆమె ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదని అంటుంటారు. హసీనా భర్త ఇస్మాయిల్ పార్కర్‌ను 1991లో అరుణ్ గావ్లీ ముఠా హత్య చేయడంతో ఆమె వార్తల్లోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement