
సాక్షి, న్యూఢిల్లీ : ప్రమాదకర కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో దేశ రాజధాని ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, పర్యాటకులు నగరానికి వస్తుండటంతో.. వైరస్ వ్యాప్తి చెందుతుందన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 30 కేసులు నమోదైనట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి అనేక చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగా ప్రాథమిక పాఠశాలలకు (ఐదో తరగతి) మార్చి 30 వరకు సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తాయని ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం ట్విటర్ వేదికగా తెలిపారు. (ఆ ఇద్దరికి కరోనా లేదు)
మరోవైపు విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యూకేషన్ (సీడీఎస్‌ఈ) విద్యార్థులకు పరిమితమైన వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. పరీక్షలుకు హాజరైయ్యే విద్యార్థులు ముఖాలకు మాస్క్‌లు ధరించవచ్చని ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచదే శాలతో సహా భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో ఇతర దేశాల నుంచి వస్తున్న వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది. ఇక వైరస్ వ్యాప్తి కారణంగా ప్రధానమంత్రి నరంద్రే మోదీ విదేశీ పర్యటన కూడా రద్దయింది. మార్చి 13న ఇండియా-ఈయూ సమ్మిట్‌లో భాగంగా మోదీ చేపట్టాల్సిన బ్రసెల్స్ పర్యటన రద్దయిందని అధికార వర్గాలు వెల్లడించాయి. (ప్రధాని బ్రసెల్స్ పర్యటన రద్దు)
Comments
Please login to add a commentAdd a comment