హాట్సాఫ్‌! మహిళా పోలీసుల కొత్త అవతారం | Delhi Women Police Making Masks For Frontline Corona Warriors | Sakshi
Sakshi News home page

హాట్సాఫ్‌! మహిళా పోలీసుల కొత్త అవతారం

Published Mon, Apr 27 2020 5:14 PM | Last Updated on Mon, Apr 27 2020 6:29 PM

Delhi Women Police Making Masks For Frontline Corona Warriors - Sakshi

మాస్కులు తయారు చేస్తున్న మహిళా పోలీసులు

న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళా పోలీసులు కొత్త అవతారం ఎత్తారు. ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికోసం దర్జీలుగా మారారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ సోకిన రోగులను రక్షించేందుకు, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఫ్రంట్‌లైన్‌ సిబ్బందైన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి రక్షణ కల్పించేందుకు ఢిల్లీ మహిళా పోలీసులు కుట్టుమిషన్లకు పని చెప్పారు. వేల సంఖ్యలో మాస్కులు తయారుచేస్తున్నారు. వీరు తయారు చేసిన మాస్కులను ఫ్రంట్‌లైన్‌ సిబ్బందితో పాటు ఇతరులకు కూడా పంపిణీ చేస్తున్నారు. ( ఫేస్‌బుక్‌ వీడియోపై కామెంట్లు చేసిందని.. )

ప్రస్తుతం మహిళా పోలీసులు మాస్కులు తయారుచేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘దిల్‌కీ పోలీస్‌.. ఢిల్లీ పోలీస్‌’ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్‌ అయిన ఈ వీడియో గంటల్లోనే దాదాపు 4 వేల లైకులు సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు వీరు చేస్తున్న పనికి చేతులెత్తి దండం పెడుతున్నారు. హాట్సాఫ్‌!! అంటూ కొనియాడుతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement