భారతదేశంలో వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష ద్వారానే వైద్య సీట్లు భర్తీ చేస్తారని తేలడంతో చాలా మంది విద్యార్థులు విదేశాలలో వైద్య విద్య ను అభ్యసించేందుకు మొగ్గు చూపుతున్నారు.
న్యూఢిల్లీ: భారతదేశంలో వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష ద్వారానే వైద్య సీట్లు భర్తీ చేస్తారని తేలడంతో చాలా మంది విద్యార్థులు విదేశాలలో వైద్య విద్య ను అభ్యసించేందుకు మొగ్గు చూపుతున్నారు. రష్యా, చైనా, ఉక్రెయిన్ లలో వైద్య విద్యలో ప్రవేశాలు తేలికగా లభించడం, అక్కడ ఖర్చు కూడా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఈ దేశాల నుంచి పట్టాలు పొందుతున్న వారి సంఖ్య ప్రతి యేడాది పెరుగుతున్నా వీరు భారతదేశంలో ప్రాక్టీస్ చేసేందుకు నిర్వహించే పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్ ) లో అర్హత సాధించలేక పోతున్నారు.
2005 లో నిర్వహించిన అర్హత పరీక్షలో 50.12 మంది అర్హత సాధించగా అది 2015 లో 10.7 కు పడిపోయింది. ఈ పదేళ్ల మధ్య కాలంలో క్లాలిషై అయిన వైద్యులు కేవలం 20 శాతం మాత్రమే. 2014లో క్లాలిఫై అయింది కేవలం 293 మందేనని ఇది 4.93 శాతం మాత్రమేనని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిపింది . ఇండియన్ మెడికల్ ఆక్ట్ 2001 ప్రకారం విదేశాల్లో వైద్య పట్టా పొందిన వారు ఏడాదికి రెండు సార్లు రెండు సార్లు స్రీనింగ్ టెస్ట్ ను పాసవ్వాల్సి ఉంటుంది. లేదా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ఎమ్ఐసీ) చే గుర్తించబడిన మెడికల్ కాలేజీ నుంచి యేడాది ఇంటెర్న్ షిప్ తో 50 శాతం ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది.
అయితే ఈ పరీక్ష అత్యంత కఠినంగా ఉంటుందని, ప్రశ్నలు పీజీ స్థాయిలో ఉంటున్నాయని, విదేశాల్లో వైద్య విద్య చేసే వారిని నిరుత్సాహ పరిచే విధంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. మెడికల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బిపిన్ బాత్రా మాట్లాడుతూ.. చాలా మంది విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు స్క్రీనింగ్ పరీక్షను కఠినంగా భావిస్తున్నారని తెలిపారు. అందుకు కారణం వైద్య విద్యలో మనకు వారికి తేడా ఉంటటమే నని అన్నారు.