
సిక్కింలో భూకంపం
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో నమోదైందని భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.
శనివారం సైతం ఈశాన్య ప్రాంతంలో భూకంపం సభవించింన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 5.0 పాయింట్ల తీవ్రతతో నమోదైన భూకంపంతో ఈశాన్య రాష్ట్రాలతో పాటు మయన్మార్‌లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు ప్రపంచంలో భూకంపాలు అత్యధికంగా సంభవించే ప్రాంతాల జాబితాలో ఆరోస్థానంలో ఉన్నాయి.