న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలతోపాటు అన్ని రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే 24 లక్షల ఈవీఎంలు అవసరమని న్యాయకమిషన్‌కు ఎన్నికల సంఘం తెలిపింది. అంతే సంఖ్యలో ఓటరు ధ్రువీకరణ (వీవీపీఏటీ) యంత్రాలు కావాలని వెల్లడించింది. ఏకకాల ఎన్నికలపై చర్చించేందుకు ఈసీ ఈ నెల 16న న్యాయ కమిషన్‌తో భేటీ అయ్యింది. కాగా రాజకీయ పార్టీలు ఆర్టీఐ పరిధిలోకి రావంటూ ఈసీ చెప్పడం వివాదాస్పదమయ్యేలా కనిపిస్తోంది. ఆర్టీఐ దరఖాస్తు మేరకు పార్టీల విరాళాల వివరాలు చెప్పేందుకు ఈసీ నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment