సాక్షి,ముంబయి: మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ఛగన్ భుజ్‌బల్‌కు చెందిన రూ 20.41 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది.పీఎంఎల్‌ఏ చట్టం కింద భుజ్‌బల్ ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఈడీ పేర్కొంది. తాజా ఉత్తర్వులతోఇప్పటివరకూ ఈ కేసులో ఈడీ అటాచ్‌చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ 178 కోట్లకు చేరిందని తెలిపింది.
ఈ కేసులో అరెస్టయిన భుజ్‌బల్ గత ఏడాది నుంచి జైలు జీవితం గడుపుతున్నారు.ఈ కేసులో భుజ్‌బల్ కుమారుడు,ఎన్‌సీపీ ఎమ్మెల్యే పంకజ్, ఆయన మేనల్లుడు సమీర్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.భుజ్‌బల్ రాష్ట్ర ప్రజాపనుల మంత్రిగా ఉన్న సమయంలో అందుకున్న ముడుపులను ఆయన కుటుంబ సభ్యులు సహా పలువురితో కలిసి కుట్రపూరితంగా దారిమళ్లించినట్టు ఈడీ ఆరోపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment