న్యూఢిల్లీ: వినియోగదారులు తమకు నచ్చిన కంపెనీనుంచి విద్యుత్‌ను కొనుక్కునే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్రం విద్యుత్ చట్టానికి సవరణలు చేస్తోంది. పంపిణీరంగంలో పోటీని పెంచడానికి ప్రభుత్వం ఈ తరహా చర్యలు చేపట్టింది. వినియోగదారులు తమకు నచ్చిన కంపెనీనుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని శనివారం ఇక్కడ కేంద్ర విద్యుత్ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు.
అయితే ఈ సదుపాయాన్ని దశలవారీగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ విధానాన్ని మహారాష్ట్రలో అమలు చేయగా, కొన్ని న్యాయపరమైన అంశాలవల్ల ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని చెప్పారు. 2003 విద్యుత్ చట్టంలో కొన్ని అవరోధాలు ఉన్నాయని తెలిపారు.
నచ్చిన కంపెనీ నుంచి విద్యుత్ కొనుగోలు
Published Sun, Dec 7 2014 2:11 AM | Last Updated on Wed, Sep 5 2018 4:28 PM
Advertisement