నాసా ఫోటోలు.. కేంద్ర మంత్రిపై జోకులు | Minister Piyush Goyal Hails 100 Percent Electrification With NASA Pics Twitter Calls Him Out | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 30 2018 11:00 AM | Last Updated on Wed, Sep 5 2018 1:47 PM

Minister Piyush Goyal Hails 100 Percent Electrification With NASA Pics Twitter Calls Him Out - Sakshi

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ : బీజేపీ నేతలు వరుసగా వివాదాలు, విచిత్ర ప్రకటనలతో వార్తల్లో నిలుస్తూ అభాసుపాలవుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ఓ ట్వీట్‌ చేసి ఆ జాబితాలో చేరిపోయారు. నాసా ఫోటోలను పోస్ట్‌ చేసి.. ‘మోదీ అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామానికి విద్యుత్‌ సరఫరా అవుతోంది’ అంటూ ఆయన ఓ సందేశం ఉంచారు. అయితే ఆయన పోస్ట్‌ చేసిన ఫోటోలు చాలా పాతవి కావడంతో కొందరు ఆయన్ని ఏకీపడేస్తున్నారు. 

‘ దేశంలో అన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా అందించినందుకు ధన్యవాదాలు . కానీ ఫోటోలు షేర్‌ చేసే ముందు మీ సోషల్‌ మీడియా విభాగానికి క్షుణ్ణంగా తనిఖీ చేసుకోమని చెప్తే బాగుండేది. అది నాసా 2017లో విడుదల చేసిన ఫోటోలు సర్‌’  అంటూ  ఓ వ్యక్తి రీట్వీట్‌ చేశారు. ‘ ఆ శాటిలైట్‌ ఫోటోలను ఎక్కడి నుంచి తీసుకున్నారు చెప్పలేదు. దయచేసి దీని కంటే బలమైన సాక్ష్యాలని చూపించండి’ అంటూ మరో వ్యక్తి రిప్లై ఇచ్చారు. ప్రతీ దీపావళి పండగ మరుసటి రోజు ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటుంది. అలాంటి ఫోటోలనే పీయూష్‌ ట్వీట్‌ చేయటంతో ఆయనపై జోకులు పేలుస్తున్నారు.

కాగా, మణిపూర్‌లోని సేనాపతి జిల్లా లాయ్‌సాంగ్‌ గ్రామానికి శనివారం కరెంటు సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. దేశంలో అన్ని గ్రామాలను విద్యుదీకరించామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పీయూష్‌ ట్వీట్‌ చేయగా.. అది కాస్త వికటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement