అహ్మదాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్–అహ్మదాబాద్(ఐఐఎం–ఏ) నూతన డైరెక్టర్ ఇన్‌చార్జ్‌గా ప్రొఫెసర్ ఎరోల్ డిసౌజా నియమితులయ్యారు. ఈయన నియామకం సెప్టెంబర్ 2 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఈయన అదే విద్యాసంస్థలో ఎకనమిక్స్ విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ముంబై యూనివర్సిటీలో ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్ పూర్తిచేసిన ఈయన అక్కడ ఎంఏ (ఎకనమిక్స్)లో గోల్డ్ మెడల్ సాధించారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ముంబై వర్సిటీ, పారిస్‌లోని యూనివర్సిటీ సైన్సెస్‌లో చైర్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సిమ్లాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా చేశారు.
ఐఐఎం–ఏ డైరెక్టర్ ఇన్‌చార్జ్‌గా డిసౌజా
Published Thu, Aug 31 2017 6:02 PM | Last Updated on Tue, Sep 12 2017 1:29 AM