రాజకీయ పార్టీలకు ఈసీ సవాల్
న్యూఢిల్లీ: ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం రాజకీయ పార్టీలకు సవాల్ విసిరింది. మధ్యాహ్నం మూడు గంటలకు విజ్ఞాన్ భవన్ రావాలని సూచించింది. కాగా ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చని, ఆప్‌తో పాటు పలు పార్టీలు ఆరోపించిన విషయం తెలిసిందే. ట్యాంపరింగ్‌పై ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం లైవ్ డెమో ఇవ్వనుంది. ఈవీఎంల భద్రతపై అనుమానాలను వ్యక్తం చేస్తున్న పార్టీలను కూడా ఈ డెమో కార్యక్రమంలో పాల్గొనాలని ఈసీ సూచనలు చేసింది.
కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే బీఎస్పీ చీఫ్ మాయావతి, ఉత్తరాఖండ్ మాజీ సీఎం రావత్ ఈవీఎంలపై (ట్యాంపరింగ్ జరిగిందంటూ) తీవ్ర ఆరోపణలు చేయగా.. వీటిపై విచారణ జరపాలని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ డిమాండ్ చేశారు. పంజాబ్‌లో తమ ఓటమికి కూడా ట్యాంపరింగే కారణమని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ట్యాంపరింగ్‌పై కోర్టుకు వెళ్లనున్నట్లు మాయావతి, కేజ్రీవాల్ తెలిపారు.
1982లోనే ఈవీఎంలను ప్రయోగాత్మకంగా భారత్‌లో వినియోగించినా.. 2004 సార్వత్రిక ఎన్నికల నుంచి పూర్తిస్థాయి వినియోగంలోకి వచ్చాయి. తాజా వివాదం నేపథ్యంలో ఈవీఎంను ట్యాంపరింగ్ చేయొచ్చా అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీల ఆరోపణల నేపథ్యంలో... ఆరోపణలు చేసిన పార్టీలను ట్యాంపరింగ్ నిరూపించాలంటూ ఈసీ సవాల్ చేసింది.