
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్పై ధరలను మంగళవారం తగ్గించిన కేంద్ర ప్రభుత్వం ఆ మరుసటి రోజే వాటిపై ఎక్సైజ్ సుంకం పెంచింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై రూ.1.17 పెంచాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ, దేశీయంగా మాత్రం ఆ ప్రభావం తక్కువగా ఉంది. పెట్రోల్, డీజిల్ లపై తగ్గించిన ధరలు అమలులోకొచ్చిన రోజే ఎక్సైజ్ సుంకాన్ని పెంచటం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.