వయసు తొమ్మిదేళ్లు... రక్తదానం చేసింది
వయసు తొమ్మిదేళ్లు... రక్తదానం చేసింది
Published Wed, Jul 9 2014 4:05 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
తొమ్మిదేళ్ల జిక్సీకి రక్తం అవసరమైంది. రక్తం ఎక్కడా దొరకలేదు. ఫేస్ బుక్ లో రక్తం కావాలని పోస్టు పెట్టగానే తొమ్మిదేళ్ల బబుల్స్ రక్త దానానికి రెడీ అయిపోయింది. బబుల్స్ రక్తం జిక్సీ ప్రాణాలను కాపాడింది.
తొమ్మిదేళ్ల వయసున్న వారు రక్తదానం చేయడమేమిటి అనుకుంటున్నారా? అయినా రక్తదానాలు మామూలే కదా అని కూడా అనుకుంటున్నారా? ఒక్క క్షణం....
జిక్సీ, బబుల్స్ మనుషులు కావు. ఈ రెండూ పెంపుడు కుక్కలు. అందుకే తొమ్మిదేళ్లకి అవి రక్తదానాలు చేశాయి.
బెంగుళూరులో వందన అనే మహిళ పెంపుడు కుక్క జిక్సీకి అంతర్గత రక్తస్రావం అయింది. వెటర్నరీ డాక్టర్లు రక్తం ఎక్కించాలన్నారు. దాంతో ఏం చేయాలో తెలియని వందన ఫేస్ బుక్ దేవుడికి అన్నీ చెప్పుకుంది. అంతే బబుల్స్ యజమాని తన కుక్క రక్తదానానికి సిద్ధం అన్నారు.
గత శుక్రవారం బబుల్స్ నుంచి 350 మి.లీ రక్తం తీసుకున్నారట. రక్తం ఇచ్చేందుకు మా కుక్కలు కూడా సిద్ధంఅని మరో 20 మంది యజమానులు రెడీ అయ్యారు.
జిక్సీ ఇప్పటికీ ఆస్పత్రిలోనే ఉంది. బబుల్స్ రక్తదానం జిక్సీని కాపాడుతుందనే ఆశిద్దాం.
Advertisement
Advertisement