కూతురిపై అత్యాచార వార్త విని..
కూతురిపై అత్యాచార వార్త విని..
Published Sun, Aug 20 2017 11:38 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. రక్షించాల్సిన రక్షక భటుడే ఓ15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపాడు. ఈ విషాద వార్త విన్న ఆ బాధితురాలి తండ్రి షాక్‌కు గురై గుండెపోటుతో మృతి చెందాడు. ఈ దారుణ సంఘటన శుక్రవారం రాత్రి ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లాలోని పోలీస్ అవుట్ పోస్టు సమీపంలో చోటుచేసుకుంది.
బాధితురాలి కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక ఆ రాత్రి టాయిలెట్‌కని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇది చూసిన గోపాల్‌పుర్ అవుట్ పోస్ట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధరమ్(38) బాలికను లాక్కెళ్లి అత్యాచారం జరిపాడు. బాలిక అరుపులు విన్నగ్రామస్థులు ఆమెను రక్షించారు. గ్రామస్థులను చూసిన కానిస్టేబుల్ అక్కడి నుంచి పరారయ్యాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను మెడికల్ పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. విధుల నుంచి కానిస్టెబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఎఎస్పీ విజయ్ గోపాల్‌సింగ్ మీడియాకు తెలిపారు.
Advertisement
Advertisement