మొరదాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ పద్నాగేళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మొరదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌లోని కాశీపూర్‌లో బుధవారం (ఆగస్టు 8) చోటుచేసుకుంది. తుపాకీతో బెదిరించి ఇద్దరు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేశామనీ, విచారణ ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.
యువతిపై అఘాయిత్యానికి పాల్పడింది ఆమెకు తెలిసిన వ్యక్తులే కావడం గమనార్హం. కాగా, ఇలాంటి ఘటనే గుంటూరులో ఇటీవల చోటుచేసుకుంది. ఉద్యోగమిస్తామని నమ్మబలికి ఓ మహిళ (28)పై నలుగురు కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ఘటనలో కూడా బాధితురాలిపై లైంగికదాడి చేసింది భర్తకు తెలిసిన వారే కావడం ఆలోచించదగ్గ విషయం.
Comments
Please login to add a commentAdd a comment