ఆ నల్లధనం 75 వేల కోట్ల పైనే..
న్యూఢిల్లీ: ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) కింద బయటపడ్డ నల్లధనం మరో రూ.10 వేల కోట్లు పెరిగే అవకాశం ఉందని ఆదాయ పన్ను శాఖ అంచనా. ఐడీఎస్ కింద దేశవ్యాప్తంగా వెలికివచ్చిన నల్లధనం రూ. 65,250 కోట్లని ఈ నెల ఒకటిన మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం తెలిసిందే. దీనికి మరో రూ. 10 వేల కోట్లు కలుస్తాయని.. ఐటీ శాఖ రికార్డులన్నీ పరిశీలించి వ చ్చే వారానికి ఈ మేరకు నివేదికను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి అందించనుందని అధికారులు తెలిపారు.
దీంతో ఐడీఎస్ కింద రూ. 75 వేల కోట్లకు పైగానే లెక్క తేలనుందని వారు తెలిపారు. అక్రమాస్తులు, నగదును 45 శాతం పన్ను కట్టి సక్రమంగా మార్చుకోవచ్చంటూ ప్రభుత్వం ఐడీఎస్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ఈ ఏడాది జూన్ 1న ప్రారంభమై సెప్టెంబర్ 30తో ముగిసింది.