నోటిఫికేషన్ జారీ చేసిన కాన్పూర్ ఐఐటీ
మూడేళ్లదాకా పరిగణనలోకి స్కోర్
హైదరాబాద్: ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ఎంటెక్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్ (గేట్-2015) నోటిఫికేషన్‌ను ఐఐటీ కాన్పూర్ జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 1 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్టు పేర్కొంది. ఆన్‌లైన్ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 31వ తే దీ, ఫిబ్రవరి 1, 7, 8, 14 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాన్ని నవంబర్ 21 తేదీ వరకు మార్పు చేసుకోవచ్చు.
డిసెంబర్ 17 వరకు ఆన్‌లైన్ ద్వారా హాల్‌టికెట్లను (అడ్మిట్ కార్డులు) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనుంది. ఫలితాలను మార్చి 12న విడుదల చేయనుంది. మరోవైపు స్కోర్ వ్యాలిడిటీకి సంబంధించిన మార్పులు చేసింది. ఇప్పటివరకు గేట్‌లో అర్హత సాధించిన విద్యార్థి ఆయా సంస్థల్లో ఎంటెక్‌లో చేరేందుకు రెండేళ్ల వరకు అవకాశం ఉంది. దానిని ఇపుడు మూడేళ్లకు పెంచింది. ఒకసారి పరీక్ష రాస్తే ఆ స్కోర్ వ్యాలిడిటీ మూడేళ్ల వరకు ఉంటుంది.
సెప్టెంబర్ 1నుంచి ఆన్‌లైన్‌లో ‘గేట్’ దరఖాస్తులు
Published Sun, Jul 13 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM
Advertisement
Advertisement