ఎన్నికల తాయిలాలు! | FTII, SRFTI to get institutes of national importance status | Sakshi
Sakshi News home page

ఎన్నికల తాయిలాలు!

Published Thu, Jul 10 2014 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM

త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌లో రాష్ట్రానికి కొంతమేర ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపిస్తోంది.

సాక్షి ముంబై: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌లో రాష్ట్రానికి కొంతమేర ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ అనేకవర్గాల ప్రజలు, విశ్లేషకులు, ప్రతిపక్ష నేతల నుంచి పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబైకి బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపు జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 పుణేలోని ఎఫ్‌టీఐఐ సంస్థకు జాతీయ హోదా కల్పించడం, నాగపూర్‌లో ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేయడం రాష్ట్రవాసులకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగించే అంశాలని చెబుతున్నారు. నాణ్యమైన విద్యనందించేందుకు దేశవ్యాప్తంగా ఐదు ఐఐఎంలను స్థాపించనున్నట్లు ప్రకటించగా అందులో ఒకటి మహారాష్ట్రకు దక్కడం కూడా ఊరటగానే చెప్పవచ్చని చెబుతున్నారు. నదుల అనుసంధానం కోసం అధ్యయనం జరిపేందుకు రూ. 100 కోట్లు కేటాయించారు. అనుసంధానం జరిగితే దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే ఎక్కువ ప్రయోజనం పొందేది మన రాష్ట్రమే.

  ఇక తీరప్రాంతాలు, ఓడరేవుల అభివృద్ధి కోసం రూ. 11,000 కోట్లను కేటాయించారు. దీంతో కేటాయించిన సొమ్ములో రాష్ట్రానికి గరిష్ట వాటా ఉంటుందనేది ఆర్థిక నిపుణుల విశ్లేషణ. చౌక ధరల ఇళ్లు, మురికివాడల అభివృద్ధి వంటి నిర్ణయాలతో నగరంలోని ధారవి వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందు తాయని చెబుతున్నారు. పుణేలో పారిశ్రామి క కారిడార్ల ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. ఇందుకోసం రూ. 100 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి అరున్ జైట్లీ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement