
దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తమదైన శైలిలో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ: ‘దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజాందోళన ఆగిపోయినప్పుడే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి విచారిస్తాం’ అని సుప్రీం కోర్టు బెంచీ గురువారం స్పష్టం చేయడం పట్ల సోషల్ మీడియాలో ట్వీట్లు తమదైన శైలిలో వెల్లువెత్తుతున్నాయి. ‘రక్తం కారడం ఆగిపోయినప్పుడే రోగి దగ్గరకు డాక్టర్ వస్తారు.. కుళాయి నుంచి నీళ్లు కారడం ఆగిపోయినప్పుడే ప్లంబర్ వస్తారు.. పంట అమ్ముడు పోయాకే కోత కోస్తాం.. ఆకలితో అల్లాడి కస్టమర్ స్పృహ తప్పాకే ఆహారాన్ని సరఫరా చేస్తాం.. పెరగడం ఆగాకే గడ్డిని కత్తిరిస్తాం.. ఆకలి తీరాకే అన్నం వండుతాం.. ప్రయాణికులు అందరు దిగిపోయాకే విమానం దిగుతుంది’ ఇలా ట్వీట్లు వెలువడుతున్నాయి.
చదవండి: దేశం కష్ట కాలంలో ఉంది