కండక్టర్ కామాంధుడైన వేళ.. | Girl jumps off moving bus to escape molestation | Sakshi
Sakshi News home page

కండక్టర్ కామాంధుడైన వేళ..

Published Wed, Mar 23 2016 7:47 PM | Last Updated on Tue, Aug 21 2018 2:30 PM

కండక్టర్ కామాంధుడైన వేళ.. - Sakshi

కండక్టర్ కామాంధుడైన వేళ..

పలాన్పూర్: ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి హాయిగా చదువుకుంటున్న ఓ పద్నాలుగేళ్ల బాలికకు తన బస్సు ప్రయాణం నిద్రలేని రాత్రిని మిగులుస్తుందని ఊహించలేదు. స్కూల్ వెళుతున్న తనను బస్ కండక్టర్ అసహ్యం పుట్టేలా మాటలు అనడంతోపాటు అసభ్యకరంగా స్పృషించేందుకు ప్రయత్నించడంతో బెదిరిపోయి రన్నింగ్ బస్సులో నుంచి దూకేసింది. దీంతో ఆ బాలికకు గాయాలు అయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పాలన్పూర్ అనే గ్రామానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. గుజరాత్ ప్రభుత్వం నడిపే ఆర్టీసీ ద్వారా ఓ స్కూల్ వెళుతుంటుంది.

మంగళవారం కూడా అలాగే బయలుదేరింది. బస్సు ఎక్కేసరికి అందులో డ్రైవర్ కండక్టర్ తప్ప ఇంకెవరూ లేరు. దీంతో బయపడిన ఆ బాలిక డోర్ వద్దే నిల్చుంది. అయితే, అలా నిల్చోవద్దని సీట్లో కూర్చోవాలని ఈశ్వర్ భాయ్(49) అనే కండక్టర్ చెప్పాడు. అనంతరం ఆ బాలిక పక్కనే కూర్చుని అసభ్యకరంగా మాట్లాడటంతోపాటు లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో భయపడిన ఆ బాలిక రన్నింగ్ లోనే బస్సులో నుంచి కిందికి దూకేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు కండక్టర్ ను అరెస్టు చేశారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement