'ఆలస్యమైతే హాస్టల్ లోకి రానివ్వడం లేదు' | Girls of Maulana Azad National Institute of Technology protest in Bhopal | Sakshi
Sakshi News home page

'ఆలస్యమైతే హాస్టల్ లోకి రానివ్వడం లేదు'

Published Fri, Aug 5 2016 2:21 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

'ఆలస్యమైతే హాస్టల్ లోకి రానివ్వడం లేదు' - Sakshi

'ఆలస్యమైతే హాస్టల్ లోకి రానివ్వడం లేదు'

భోపాల్: దుస్తుల ధారణ, హాస్టల్ సమయంపై ఆంక్షలు విధించడాన్ని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఏఎన్ఐటీ) విద్యార్థినులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాత్రి 9.30 గంటల్లోపు హాస్టల్ కు చేరుకోకపోతే లోపలికి అనుమతించబోమన్న అధికారులు నిర్ణయాన్ని విద్యార్థినులు తప్పుబట్టారు. క్యాంపస్ లో షార్ట్స్, స్కర్టులు ధరించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినుల నుంచి తీవ్రవ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయాన్ని అధికారులు ఉపసంహరించుకున్నారు.

'ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతున్నాయి. అటు నుంచి అటే కోచింగ్ కు వెళుతున్నాం. ఒక్కోసారి కోచింగ్ క్లాసుల్లో ఆలస్యమవుతోంది. రాత్రి 9.30 గంటల తర్వాత వస్తే హాస్టల్ లోకి అనుమతించడం లేదు. అలసిపోయిన వచ్చిన మేము లాబీలో పడుకోవాల్సి వస్తోంది. అబ్బాయిలకు ఇటువంటి నిబంధన పెట్టలేద'ని హర్ష అనే విద్యార్థిని వాపోయింది.

విద్యార్థినుల దుస్తులపై ఆంక్షలు విధించడాన్ని అతిపిన్న వయసులో సర్పంచ్ గా ఎన్నికైన భక్తి శర్మ తప్పుబట్టారు. మనం 21వ శతాబ్దంలో ఉన్నామని, దుస్తుల ధారణ విషయంలో నియంత్రణలు సరికాదన్నారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు విద్యార్థులతో అధికారులు చర్చించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement