విపక్షాల నిరసనల మధ్యే పార్లమెంట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. లోక్సభలో కాంగ్రెస్ ఆందోళన కొనసాగుతోంది.
న్యూఢిల్లీ : విపక్షాల నిరసనల మధ్యే పార్లమెంట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. లోక్సభలో కాంగ్రెస్ ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు జోక్యం చేసుకుని, నియమ నిబంధనల ప్రకారమే సమావేశాలు కొనసాగుతాయని తెలిపారు. అయినా విపక్షాలు తమ పట్టువీడలేదు. నిబంధనల మేరకే సభ జరుగుతుందని స్పీకర్ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరమే ...సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని తెలిపారు.
మరోవైపు లలిత్ మోదీ అంశంపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నామని సుష్మా స్వరాజ్ మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అడిగే అన్ని ప్రశ్నలు అన్నింటికి సమాధానం చెబుతానని, సమాధానం చెప్పే అవకాశం కూడా తమకు ఇవ్వాలన్నారు. లలిత్ మోదీ వ్యవహారంపై ఎంతమంది అయినా మాట్లాడవచ్చని సుష్మ తెలిపారు. మరోవైపు విపక్షాల నిరసనలు, ఆందోళనలతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది.