నేడు ప్రధానితో భేటీకానున్న గవర్నర్ | governor narasimhan meets narendra modi today | Sakshi
Sakshi News home page

నేడు ప్రధానితో భేటీకానున్న గవర్నర్

Published Fri, Dec 12 2014 12:34 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

నేడు ప్రధానితో భేటీకానున్న గవర్నర్ - Sakshi

నేడు ప్రధానితో భేటీకానున్న గవర్నర్

సాక్షి, న్యూఢిల్లీ: విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలు, తాజా పరిస్థితులను  వివరిచేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో ఇరు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శుక్రవారం భేటీ కానున్నారు. ప్రధానిని కలసి పలు అంశాలపై చర్చించనున్నట్టు నరసింహన్ మీడియాకు వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన  సమావేశంలో రాష్ట్రాల మధ్య వివాదాలు, తాజా పరిస్థితులను వివరించినట్టు పేర్కొన్నారు.

 

కాగా, రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న గవర్నర్ గురువారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైదరాబాద్ హౌస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement