న్యూఢిల్లీ: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా గుర్‌పత్వంత్ సింగ్ పన్నూన్ సహా తొమ్మిది మందిని ఉగ్రవాదులుగా గుర్తించింది. ఈ మేరకు బుధవారం రోజున కేంద్ర ప్రభుత్వం జాబితా ప్రకటించింది. అమెరికాలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా పంజాబ్ యువకులను ఉగ్రవాదంలోకి చేరడానికి ప్రేరేపిస్తున్నాడనే కారణంతో పన్నూన్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.
యూఏపీఏ కింద ఉగ్రవాదులుగా గుర్తించబడిన వారిలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన పరమ్‌జిత్ సింగ్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌కు చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్, ఖలీస్తాన్ జిందాబాద్ ఫోర్స్‌కు చెందిన గుర్మిత్ సింగ్ బాగ్గా తదితరులు ఉన్నారు. కాగా గత సెప్టెంబర్‌లో.. సవరించిన యూఏపీఏ నిబంధనల ప్రకారం ప్రకటించిన ఉగ్రవాదులైన మౌలానా మసూద్ అజార్, హఫీజ్ సయీద్, జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, దావూద్ ఇబ్రహీంలతో కలిపి ఈ సంఖ్య 13కు చేరుకుంది. (కీలక నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ..)
Comments
Please login to add a commentAdd a comment