గుజరాత్‌లో బ్లూవేల్ బ్యాన్
గుజరాత్‌లో బ్లూవేల్ బ్యాన్
Published Tue, Sep 5 2017 7:17 PM | Last Updated on Tue, Aug 21 2018 2:43 PM
అహ్మదాబాద్: చిన్నారులను బలిగొంటున్న బ్లూవేల్ గేమ్‌ను తమ ప్రభుత్వం నిషేధిస్తుందని గుజరాత్ సీఎం విజయ్ రూపాని చెప్పారు. రాష్ట్రంలో ఈ మృత్యు క్రీడను నిషేధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని హోంశాఖకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ గేమ్ ఫలితంగా చిన్నారులు, యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళనకరమని, ఇలాంటి గేమ్‌లకు అడ్డుకట్ట వేయాల్సి ఉందని సీఎం మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
గుజరాత్‌లో ఈ క్రీడను బ్యాన్ చేసేందుకు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువస్తుందన్నారు. బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్‌తో చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితిని అనుమతించబోమని, వీలైనంత త్వరలో దీన్ని నిషేధించేందుకు అవసరమైన అన్ని చర్యలూ సత్వరమే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
Advertisement
Advertisement