
'కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు'
ఢిల్లీ:నల్లొండ జిల్లా నాగార్జుసాగర్ లో మూడు రోజుల పాటు జరిగిన టీఆర్ఎస్ శిక్షణా తరగతుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.
సామాన్య ప్రజలకు కేసీఆర్ అసలు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఈ సందర్భంగా గుత్తా పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా.. ప్రభుత్వం దళితులకు భూములు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.