
చెరువు వద్ద పూజలు చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే
చందంపేట (దేవరకొండ) : రైతాంగ శ్రేయస్సే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పోలేపల్లి, చందంపేట, గుంటిపల్లి, ముడుదండ్ల గ్రామాల పరిధిలోని చెరువుల వద్ద కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌తో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గుత్తా మాట్లాడుతూ 70 ఏళ్లుగా పూడికతో నిండిన కాల్వలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కాల్వల ద్వారా మండలంలోని ఆయా గ్రామాల్లోని చెరువులు జలకళను సంతరించుకోవడంతో రైతన్నలకు సాగు నీటికి డోకా లేదన్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి డిండి రిజర్వాయర్ ద్వారా చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లోని సుమారు 12 చెరువులను నింపనున్నట్లు తెలిపారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయన్నారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ కాల్వల ద్వారా చెరువులకు నీరు చేరుతుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివెరుస్తోందని అన్నారు. అంతకుముందు ఎంపీ, ఎమ్మెల్యేలు చెరువుల వద్ద పూజలు చేశారు. కార్యక్రమంలో దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, వైస్ ఎంపీపీ వేణుధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, శ్రీనివాస్‌గౌడ్, డీఈ రూప్లానాయక్, శిరందాసు కష్ణయ్య, సర్పంచ్ అన్నెపాక ధనమ్మ, మల్లారెడ్డి, అనంతగిరి, మల్లేశ్‌యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment