దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన అమెరికా
వాషింగ్టన్: అమెరికాలో హెచ్ 4 వీసాదారులు కూడా ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే ఉద్యోగ అర్హత కార్డు(ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డ్)ల దరఖాస్తు ప్రక్రియను యూఎస్ అధికారులు ప్రారంభించారు. గతంలో హెచ్ 1బీ వీసా కలిగి ఉన్నవారి జీవిత భాగస్వాములు డిపెండెంట్ వీసా(హెచ్ 4 నాన్ ఇమిగ్రంట్స్)పై అమెరికా వెళ్లినప్పటికీ వారికి అక్కడ ఉద్యోగం చేసే అవకాశం లేకుండా ఉండేది. అయితే, ఇటీవల కొన్ని కేటగిరీల హెచ్ 4 వీసాదారులకు కూడా ఉద్యోగం చేసే వీలు కల్పిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చట్టంలోనూ మార్పులు చేశారు.
ఈ నిర్ణయం వల్ల 1.8 లక్షల మందికి అమెరికాలో ఉద్యోగం చేసే అర్హత లభించనుంది. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా అర్హులకు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డ్‌ను జారీ చేస్తామని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) అధికారులు తెలిపారు. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డ్ పొందాలంటే హెచ్ 4 వీసా ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామి(హెచ్ 1 వీసాపై యూఎస్‌లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి) అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్స్ హోదా కోసం చట్టబద్ధ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించి ఉండాలి.
హెచ్4 వీసాదారులకు ఉద్యోగ అర్హత కార్డులు!
Published Thu, May 28 2015 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM
Advertisement