‘నేను తీసుకెళ్లలేదు.. అతడే నాతో వచ్చాడు’ | He Loves Me, Says 'Revolver Rani', Arrested | Sakshi
Sakshi News home page

‘నేను తీసుకెళ్లలేదు.. అతడే నాతో వచ్చాడు’

Published Thu, May 18 2017 11:44 AM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

‘నేను తీసుకెళ్లలేదు.. అతడే నాతో వచ్చాడు’

‘నేను తీసుకెళ్లలేదు.. అతడే నాతో వచ్చాడు’

బుందేల్‌ఖండ్‌: రివాల్వర్‌ రాణి(వర్షా సాహు)ని పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రియుడని చెప్పి అశోక్‌ యాదవ్‌ అనే ఓ పెళ్లి కొడుకు తలకు తుపాకీ గురిపెట్టి మరీ పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకెళ్లిన ఆమెను బుందేల్‌ఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాను అసలు తుపాకీ తీసుకురాలేదని, అశోక్‌ను తాను బలవంతంగా తీసుకెళ్లలేదని, తనే స్వయంగా ఇష్టంతో తనతో వచ్చాడని చెప్పింది. ఎందుకంటే అతడు తనను ఎంతో ప్రేమిస్తున్నాడని కూడా వివరించింది. ‘నేను అక్కడికి తుపాకీతో వెళ్లలేదు.. అదంతా కూడా అబద్ధం’ అని కుర్తా సల్వార్‌ ధరించి పోలీస్‌ స్టేషన్‌లో కూర్చున్న ఆమె తన వాంగ్మూలంలో తెలిపింది.

మంగళవారం రాత్రి వేరే అమ్మాయితో పెళ్లి జరుగుతుండగా ఎస్‌యూవీ వాహనంలో వచ్చి వర్షా నేరుగా పెళ్లి కొడుకు తుపాకీ గురిపెట్టి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, తమకు రహస్యంగా  వివాహం కూడా జరిగిందని, అశోక్‌ తల్లిదండ్రులు అతడికి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లికి బలవంతంగా కూర్చొబెట్టారంటూ చెప్పిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం తన తల్లి, సోదరితో కలిసి ఉంటున్నా వర్షా పెళ్లి కొడుకు తనంతట తనే వచ్చి కారులో కూర్చున్నాడని, ఇష్ట పూర్తిగా వచ్చాడని తెలిపింది. ‘ఆ పెళ్లిపట్ల అతడు సంతోషంగా లేడు. ఆ అమ్మాయిని చేసుకునేందుకు అతడు సిద్ధంగా లేడు. ఆ అమ్మాయి కుటుంబానికి కూడా అతడు మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడనే విషయం తెలుసు. అయితే, అన్నీ సర్దుకుపోతాయని వారు భావించారు’ అని కూడా పోలీసులకు వివరించింది. ఇదిలా ఉండగా అశోక్‌ యాదవ్‌ ఇప్పటికీ కనిపించడం లేదంట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement