ashok yadav
-
బిహార్: జేడీయూ నేత హత్య
పట్నా: బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. జేడీయూ పార్టీకి చెందిన ఓ నేత మంగళవారం రాత్రి 8 గంటలకు హత్యకు గురయ్యారు. వివరాలు.. మాధేపురా జిల్లాలో ఆశోక్ యుదవ్(50) అనే జేడీయూ నేతపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. జేడీయూ గాంహరియా బ్లాక్ ప్రెసిడెంట్ ఉన్నఅశోక్ యాదవ్ తన స్వగ్రామం జోగ్బానీలో ఓ దుకాణం వద్ద నిలబడి ఉన్న సమయంలో ఈ హత్య ఘటన జరిగినట్లు మాధేపురా సబ్ డివిజన్ పోలీసు ఆఫీసర్( ఎస్డీపీఓ) వాషి అహ్మద్ తెలిపారు. మోటర్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆయన్ని స్థానిక సుపాల్ సదర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇక ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సదర్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆశోక్ యాదవ్‌పై కాల్పులుకు పాల్పడిన వారిని ఇంకా గుర్తించలేదని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్యకు సంబంధించి రాజకీయం కోణంలో కూడా దర్యాప్తు చేస్తామన్నారు. -
‘నేను తీసుకెళ్లలేదు.. అతడే నాతో వచ్చాడు’
బుందేల్‌ఖండ్: రివాల్వర్ రాణి(వర్షా సాహు)ని పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రియుడని చెప్పి అశోక్ యాదవ్ అనే ఓ పెళ్లి కొడుకు తలకు తుపాకీ గురిపెట్టి మరీ పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకెళ్లిన ఆమెను బుందేల్‌ఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాను అసలు తుపాకీ తీసుకురాలేదని, అశోక్‌ను తాను బలవంతంగా తీసుకెళ్లలేదని, తనే స్వయంగా ఇష్టంతో తనతో వచ్చాడని చెప్పింది. ఎందుకంటే అతడు తనను ఎంతో ప్రేమిస్తున్నాడని కూడా వివరించింది. ‘నేను అక్కడికి తుపాకీతో వెళ్లలేదు.. అదంతా కూడా అబద్ధం’ అని కుర్తా సల్వార్ ధరించి పోలీస్ స్టేషన్లో కూర్చున్న ఆమె తన వాంగ్మూలంలో తెలిపింది. మంగళవారం రాత్రి వేరే అమ్మాయితో పెళ్లి జరుగుతుండగా ఎస్యూవీ వాహనంలో వచ్చి వర్షా నేరుగా పెళ్లి కొడుకు తుపాకీ గురిపెట్టి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, తమకు రహస్యంగా వివాహం కూడా జరిగిందని, అశోక్ తల్లిదండ్రులు అతడికి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లికి బలవంతంగా కూర్చొబెట్టారంటూ చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన తల్లి, సోదరితో కలిసి ఉంటున్నా వర్షా పెళ్లి కొడుకు తనంతట తనే వచ్చి కారులో కూర్చున్నాడని, ఇష్ట పూర్తిగా వచ్చాడని తెలిపింది. ‘ఆ పెళ్లిపట్ల అతడు సంతోషంగా లేడు. ఆ అమ్మాయిని చేసుకునేందుకు అతడు సిద్ధంగా లేడు. ఆ అమ్మాయి కుటుంబానికి కూడా అతడు మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడనే విషయం తెలుసు. అయితే, అన్నీ సర్దుకుపోతాయని వారు భావించారు’ అని కూడా పోలీసులకు వివరించింది. ఇదిలా ఉండగా అశోక్ యాదవ్ ఇప్పటికీ కనిపించడం లేదంట. -
సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి
= దున్నపోతు దాడి.. యువకుడి మృతి సికింద్రాబాద్, న్యూస్‌లైన్: సదర్ ఉత్సవాల్లో సోమవారం రాత్రి అపశ్రుతి దొర్లింది. ఊరేగింపు కోసం ఉంచిన దున్నపోతు వీరంగం సృష్టించడంతో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మారేడుపల్లి, తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ సరిహద్దుల మధ్య జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మారేడుపల్లికి చెందిన యాదవసంఘం ప్రతినిధి వెంకటేష్‌యాదవ్ ఆధ్వర్యంలో దున్నపోతులతో కూడిన సదర్ ర్యాలీ సోమవారం రాత్రి ఈస్ట్ మారేడుపల్లి నుంచి ప్రారంభమైంది. బాణసంచా పేళుల్లు, డప్పుచప్పుళ్లు, యువకుల నృత్యాల మధ్య షేనాయ్ నర్సింగ్ హోం సమీపంలోని ముత్యాలమ్మ దేవాలయం వద్దకు చేరింది. అక్కడ కాసేపు ర్యాలీని నిలిపి దున్నపోతులను ఆడించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రెచ్చిపోయిన దున్నపోతు వీరంగం సృష్టించింది. ప్రజల మీదకు ఉరికింది. ఈ ఘటనలో ఈస్ట్మారేడుపల్లికి చెందిన ముత్యాలు యాదవ్ కుమారుడు అశోక్‌యాదవ్ (35) కడుపులోకి దున్నపోతు కొమ్ములు దూసుకెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. ఉత్సవ నిర్వాహకులు బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు గాంధీ వైద్యులు ధృవీకరించారు. సంఘటనలో మరో ఇద్దరు యువకులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. అటు తుకారాంగేట్ పోలీసులు, ఇటు మారేడుపల్లి పోలీసులు ‘పరిధి’ల గొడవతో ఘటన జరిగిన రెండు గంటల వరకు సంఘటన స్థలానికి రాలేదు. -
గ్రేటర్... గో బ్యాక్!
‘శివారు గ్రామాల విలీనం’పై అఖిలపక్షాల నిరసన హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘గ్రేటర్ - గోబ్యాక్, సీఎం - డౌన్‌డౌన్, ప్రాణాలైనా ఇస్తాం - మా గ్రామాలను గ్రేటర్లో కలపనివ్వం...’ నినాదాలతో రాజేంద్రనగర్ మండలం నార్సింగ్ జంక్షన్ దద్దరిల్లింది. రాజధాని శివారు గ్రామాలను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లో కలపటాన్ని వ్యతిరేకిస్తూ మండల అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో శనివారం నార్సింగ్ జంక్షన్లో మహాధర్నా నిర్వహించారు. పెత్తందారుల భూముల కోసమే ప్రభుత్వం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాజేంద్రనగర్ మండలం పరిధిలోని 13 గ్రామాలను గ్రేటర్లో విలీనం చేసిందని ఈ సందర్భంగా నిరసనకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పచ్చని పొలాలతో కళకళలాడే గ్రామాలను నగరంలో ఎలా విలీనం చేస్తారు? ఎవరిని అడిగి విలీన ప్రక్రియ కొనసాగించారు?’ అంటూ మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయటానికి వెనకాడనప్పుడు.. తాము తమ సొంత గ్రామాలను నగరంలో విలీనం చేయటంపై పోరాడటంలో తప్పేముందని అధికార కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. విలీనానికి నిరసనగా తొలుత ర్యాలీ నిర్వహించారు. ధర్నా సందర్భంగా నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత తలెత్తింది. ధర్నా నిర్వహిస్తున్న సమయంలో అటుగా వాహనాలను అనుమతించటంతో కోకాపేట్ మాజీ సర్పంచ్ రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. మిగతా నాయకులూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు. ఈ క్రమంలో నార్సింగ్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్యాతమ్ అశోక్‌యాదవ్ సొమ్మసిల్లి రోడ్డుపై పడిపోయారు. నిరసనకారులు ఔటర్ రింగురోడ్డుపైకి దూసుకువెళ్లటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని నిలువరించారు. ధర్నా సందర్భంగా ఆ మార్గంలో కిలోమీటర్ మేర ట్రాఫిక్జామైంది.