పోలాండ్లో రివాల్వర్ రాణీ | Shraddha Das heads to Poland | Sakshi
Sakshi News home page

పోలాండ్లో రివాల్వర్ రాణీ

Published Thu, May 28 2015 10:54 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

పోలాండ్లో రివాల్వర్ రాణీ

పోలాండ్లో రివాల్వర్ రాణీ

టాలీవుడ్ ప్రముఖ నటి శ్రద్ధదాస్ వరుస చిత్ర షూటింగులతో యమబిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం గుంటూరు టాకీస్. ఆ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పోలాండ్లో జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ఆమె రివాల్వర్ రాణీ పాత్ర పోషిస్తుంది. ఆ చిత్రంలోని పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ అంతా పోలాండ్ తరలి వెళ్లింది. ఇప్పటి వరకు ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అనంతపురం జిల్లా హిందూపురంలో జరుపుకున్న సంగతి తెలిసిందే.

గుంటూరు టాకీస్ చిత్రం అటు హిందీ, ఇటు తెలుగు భాషల్లో తెరకెక్కుతుంది. తెలుగు చిత్రంలో శ్రద్ధ సీఈవోగా నటిస్తుండగా... హిందీ చిత్రంలో జర్నలిస్ట్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పోలాండ్లోని క్రాకో నగరంలో దిగిన ఫోటోలను శ్రద్ధ తన మైక్రో బ్లాగ్లో ఉంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement