నిరీక్షణకు తెర | housing scheme started on friday | Sakshi
Sakshi News home page

నిరీక్షణకు తెర

Published Fri, Aug 22 2014 10:02 PM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

నిరీక్షణకు తెర

నిరీక్షణకు తెర

సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 2014 హౌసింగ్ పథకాన్ని (డీడీఏ) శుక్రవారం ప్రకటించింది. ఈ పథకం కింద ఇరవైఐదువేల మందికిపైగా అర్హులైన దరఖాస్తుదారులకు ఫ్లాట్లను కేటాయించనుంది. అయితే వీటిలో 80 శాతం ఫ్లాట్లను ఢిల్లీవాసుల కేటాయించాలనే ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తోసిపుచ్చారు. దీంతో ఈ ఫ్లాట్లకోసం ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు వీలుకలిగింది. వచ్చే నెల ఒకటో తేదీనుంచి దరఖాస్తు ఫారాలు అందరికీ అందుబాటులో ఉంటాయి.
 
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) 2014 శుక్రవారం హౌసింగ్ పథకాన్ని ప్రకటించింది.  మొత్తం 25,034 ఫ్లాట్లను ఈ పథకం కింద కేటాయించనుంది. ఈ పథకానికి సంబంధించిన ఫారాలు వచ్చే నెల ఒకటి నుంచి అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత 15 లేదా 20 రోజుల్లోగా డ్రా తీస్తారు. న్యాయమూర్తి సమక్షంలో ఓ స్వతంత్య్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ డ్రా జరుగుతుంది. దీనిద్వారా కేటాయించిన ఫ్లాట్లను వచ్చే ఏడాది మార్చిలోగా కేటాయిస్తారు. ఏడాది లోపల కేటాయించిన ఫ్లాట్ తాళం చెవి ఫ్లాటు యజమానుల చేతికి అందుతుంది.  జనరల్ కేటగిరీకి చెందినవారు రూ. లక్ష, ఈడబ్ల్య్యూఎస్ కేటగిరీకి చెందిన వారు రూ. పదివేలను రిజిస్ట్రేషన్ రుసుము కింద చెల్లించాల్సిఉంటుంది.
 
కాగా పథకం కోసం డీడీఏ 13  బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. పాన్ కార్డు కలిగిన 18 సంవత్సరాలకు పైబడినవారు ఈ పథకం కింద ఫ్లాట్ పొందేందుకు దరఖాస్తు చే యవచ్చు.ద్వారకా,నరేలా, రోహిణీ వంటి ప్రాంతాల్లో ఉన్న 25,034 వేలకు ఫ్లాట్లను డీడీఏ.. ఈ పథకం ద్వారా కేటాయించనుంది. వీటిలో 22,627  ఫ్లాట్లు సింగిల్ బెడ్ రూము ఫ్లాట్లు. అందులోఓ పడకగది , డ్రాయింగ్ రూం, వంటగది ఉంటాయి. గతంలో ప్రకటించిన స్కీంల కింద కేటాయించినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ సొంతం చేసుకోని 811 ఫ్లాట్లను కూడా ఈ పథకంలో చేర్చారు. ఇవి జసోలా, వసంత్‌కుంజ్‌లలో ఉన్నాయి. ఈ పథకంలో భాగంగా  700 ఫ్లాట్లను ఈడబ్యూఎస్  కేటగిరీ కింద కేటాయిస్తారు. వీటిని ప్రయివేట్ డెవలపర్ నిర్మించారు.
 
ఈడబ్ల్యూఎస్ కింద దరఖాస్తు చేసేవారు సంవత్సరానికి రూ. లక్షన్నర ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని చూపవలసిఉంటుంది. ఇవికాక వివిధ కేటగిరీల కింద 896 ఫ్లాట్లను రిజర్వ్ చేశారు. ఈ పథకం కింద కేటాయించే ఫ్లాట్లలో అత్యధికంగా 10,875 రోహిణీ సెక్టర్ 34 ,సెక్టర్- 35లో ఉన్నాయి. నరేలాలో 6,422  ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌ు ధర రూ.6.6లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉండగా, ఏక పడక గది ఫ్లాట్ ధర రూ. 14.9 లక్షల నుంచి రూ. 22 లక్షల వరకు ఉంది. మోతియాఖాన్ ప్రాంతంలోని కొన్ని ఎంఐజీ ఫ్లాట్ల ధర రూ.1.2 కోట్లవరకు ఉంది. ఈ పథకం కింద కేటాయించిన ఫ్లాట్లను ఐదు సంవత్సరాల తరువాత రిజిస్ట్రేషన్  చేస్తారు.

ఫ్లాట్‌ను దక్కించుకున్నవారు వాటినిఐదేళ్ల పాటు అమ్మకుండా చేయడంకోసం డీడీఏ... సంబంధిత ఫ్లాట్ యజమానితో రిజీస్ట్రీ ఒప్పందం చేసుకుంటుంది. ఈ షరతును మొదటిసారిగా డీడీఏ విధించింది.  రానున్న 30 సంవత్సరాల పాటు ఫ్లాట్ల నిర్వహణ కోసం రూ.300 కోట్ల నిధిని ఏర్పాటుచేసింది. ఈ పథకం కింద చేర్చిన ఇళ్లన్నీ గ్రీన్ టెక్నాలజీ నిర్మించిన ఫ్లాట్లేనని డీడీఏ చెబుతోంది. ఈ పథకం కోసం డీడీఏ పది లక్షల  బ్రోచర్లను ముద్రించింది. ఈ పథకం కింద 80 శాతం ఢిల్లీవాసులకు కేటాయించాలనే ప్రతిపాదనను గురువారం జరిగిన సమావేశంలో లెప్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement