‘కేజ్రీవాల్ కు సొంత నిఘా సంస్థ’
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పాలనకు సంబంధించి షుంగ్లూ కమిటీ కొన్ని అవకతవకలను గుర్తించిందనీ, ఆయన నేరారోపణలు ఎదుర్కోవాల్సి రావొచ్చని ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పేర్కొన్నారు. కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సభ్యులు ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారని జంగ్ అన్నారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి వ్యతిరేకంగా కేజ్రీవాల్ సొంతంగా మరో నిఘా సంస్థను రహస్యంగా ఏర్పాటు చేశారని జంగ్ ఆరోపించారు. కేజ్రీవాల్ భార్యకు బంధువైన నికుంజ్ అగర్వాల్‌ను ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఓఎస్డీగా, సత్యేంద్ర కూతురు సౌమ్య జైన్‌ను మొహల్లా క్లినిక్స్ ప్రాజెక్టుకు సలహాదారుగా నియమించడం ఆశ్రిత పక్షపాతాన్ని తెలుపుతోందన్నారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.